ఇంట్లో ఎంతమంది ఉన్నా ఒక్కక్కరికి పదివేలు
విశాఖ ఎల్జీ పాలిమర్స్ బాధితులకు నేడు ప్రభుత్వం పరిహారాన్ని పంపిణీ చేయనుంది. ఇప్పటికే మరణించిన కుటుంబాలకు కోటి రూపాయలు, ఆసుపత్రుల్లో ఉన్న వారికి లక్ష, క్షతగాత్రులకు ఇరవై [more]
;
విశాఖ ఎల్జీ పాలిమర్స్ బాధితులకు నేడు ప్రభుత్వం పరిహారాన్ని పంపిణీ చేయనుంది. ఇప్పటికే మరణించిన కుటుంబాలకు కోటి రూపాయలు, ఆసుపత్రుల్లో ఉన్న వారికి లక్ష, క్షతగాత్రులకు ఇరవై [more]
విశాఖ ఎల్జీ పాలిమర్స్ బాధితులకు నేడు ప్రభుత్వం పరిహారాన్ని పంపిణీ చేయనుంది. ఇప్పటికే మరణించిన కుటుంబాలకు కోటి రూపాయలు, ఆసుపత్రుల్లో ఉన్న వారికి లక్ష, క్షతగాత్రులకు ఇరవై ఐదు వేల చొప్పున ప్రభుత్వం పంపిణీ చేసింది. ఇక ఎల్జీ పాలిమర్స్ పరిసర ప్రాంతాల్లోని ఐదు గ్రామాల ప్రజలకు ఒక్కొక్కరికి పదివేల రూపాయలను నేడు పంచనున్నారు. ఇంట్లో ఎంత మంది ఉన్నా ఒక్కొక్కరికి పదివేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఆ ఐదు గ్రామాల్లో వాలంటీర్లు ఇంటింటి సర్వే చేసి బ్యాంకు అకౌంట్ల వివరాలను తెలుసుకున్నారు. వారి ఖాతాల్లోనే పదివేల రూపాయల నగదు నేడు జమకానుంది. చిన్నారులకు కూడా పదివేల రూపాయలు ఇవ్వనున్నారు.