హెచ్-4 వీసా లకు వర్క్ పర్మిట్ ను కొనసాగించాలని ఇద్దరు అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు బిల్లు ను ప్రవేశపెట్టారు. హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వామి అమెరికాలో పనిచేసుకునేందుకు హెచ్-4 వీసాలను మంజూరు చేస్తారు.ఒబామా రాష్ట్రపతి గా ఉన్నపుడు హెచ్-4 వీసా దారులు ఉద్యోగం చేసే విదంగా వర్క్ పర్మిట్ లను మంజూరు చేసే విధానాన్ని ప్రవేశ పెట్టారు
అయితే, అమెరికా ప్రజల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయనే ఉద్దేశ్యంతో ఇటీవల ట్రంప్ ప్రభుత్వం హెచ్-4 వీసాదారులకు వర్క్ పర్మిట్ లు రద్దు చేయాలని నిర్ణయించింది. అయితే, ఈ నిర్ణయం ద్వారా ప్రతిభావంతులైన వారు దేశం విడిచి వెళ్లాల్సి వస్తుందని, కుటుంబాలు విడిపోయే ప్రమాదం ఉందని పేర్కొంటూ అన్నా జీ ఎషో, జోయ్ లాప్ గ్రెన్ అనే ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు ట్రంప్ యంత్రాంగం నిర్ణయానికి వ్యతిరేకంగా బిల్లు ప్రవేశపెట్టారు. ఈ నిర్ణయంతో దేశం విడిచి వెళ్లే వారు, వారి టాలెంట్ ను అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉపయోగించే ప్రమాదం ఉందని వారు పేర్కొన్నారు. హెచ్4 వీసాల వర్క్ పర్మిట్ రద్దు చేయడం వల్ల అమెరికాకు కలిగే ప్రయోజనాలు కూడా పెద్దగా ఏమీ ఉండవని వారు బిల్లులో పేర్కొన్నారు. ‘హెచ్-4 ఎంప్లాయిమెంట్ ప్రొటెక్షన్ యాక్ట్’ పేరుతో వారు ఈ బిల్లును ప్రవేశపెట్టారు.