Tej : నెలరోజులు అపోలోలోనే… ఈరోజు ఇంటికి

హీరో సాయి ధరమ్ తేజ్ అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈరోజు ఉదయం ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. గత నెల 10 తేదీన [more]

;

Update: 2021-10-15 06:35 GMT
Tej : నెలరోజులు అపోలోలోనే… ఈరోజు ఇంటికి
  • whatsapp icon

హీరో సాయి ధరమ్ తేజ్ అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈరోజు ఉదయం ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. గత నెల 10 తేదీన రోడ్డు ప్రమాదంలో గాయపడిన సాయి ధరమ్ తేజ్ అపోలో ఆసుపత్రిలో చేరారు. బైక్ నుంచి పడిపోయిన ఆయనకు అపోలో ఆసుపత్రి వైద్యులు రెండు సర్జరీలు కూడా చేశారు. దాదాపు నెలరోజులకు పైగానే సాయి ధరమ్ తేజ్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందారు.

35 రోజుల పాటు….

సాయి ధరమ్ తేజ్ కు దాదాపు 35 రోజుల పాటు చికిత్స ను అందించిన అపోలో వైద్యులు ఆయనకు ఎటువంటి ఇబ్బంది లేదని ప్రకటించారు. ఇకపై సాధారణంగానే తన పనులు తాను చేసుకోగలరని తెలిపారు. పూర్తిగా కోలుకున్న తర్వాతనే సాయి ధరమ్ తేజ్ ను డిశ్చార్జ్ చేశామని అపోలో వైద్యులు వెల్లడించారు. సాయి ధరమ్ తేజ్ డిశ్చార్జ్ కావడంపై తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

Tags:    

Similar News