కోర్టులు తెరిచేందుకు హైకోర్టు అనుమతి

రాష్ట్రంలోని అన్ని కోర్టులు తెరిచేందుకు తెలంగాణ హైకోర్టు అనుమతించింది. ఈ మేరకు డిసెంబర్‌ 31 వరకు న్యాయస్థానాలు అనుసరించాల్సిన అన్‌లాక్‌ విధానాలను ఉన్నత న్యాయస్థానం వెల్లడించింది. హైదరాబాద్‌ [more]

;

Update: 2020-11-08 12:43 GMT

రాష్ట్రంలోని అన్ని కోర్టులు తెరిచేందుకు తెలంగాణ హైకోర్టు అనుమతించింది. ఈ మేరకు డిసెంబర్‌ 31 వరకు న్యాయస్థానాలు అనుసరించాల్సిన అన్‌లాక్‌ విధానాలను ఉన్నత న్యాయస్థానం వెల్లడించింది. హైదరాబాద్‌ మినహా మిగతా జిల్లాల్లో ఇప్పటికే భౌతికంగా కేసుల విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌ జిల్లాలోని సివిల్‌, క్రిమినల్‌ కోర్టులూ తెరవాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. మరోవైపు డిసెంబర్‌ 31 వరకు హైకోర్టులో ఆన్‌లైన్‌, భౌతిక విచారణ విధానమే కొనసాగించాలని నిర్ణయించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసుల విచారణ వేగవంతం చేయాలని స్పష్టం చేసింది. సీబీఐ, ఏసీబీ ప్రత్యేక కోర్టులు.. ఎంపీలు, ఎమ్మెల్యేల కేసుల ప్రత్యేక కోర్టులు ప్రస్తుతం అనుసరిస్తోన్న విధానాన్నే కొనసాగించాలని ఆదేశాలిచ్చింది. హైకోర్టు విధించిన గడువుకు కట్టుబడి విచారణ జరపాలంటూ హైకోర్టు రిజిస్ట్రార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Tags:    

Similar News