బ్రేకింగ్ : మరోసారి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు చుక్కెదురు

సింగిల్ జడ్జి ఉత్తర్వులపై తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు ధర్మాసనం తెలిపింది. స్వస్తిక్ ముద్ర తప్పించి వేరేవి చెల్లవని సింగిల్ జడ్జి ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. [more]

;

Update: 2020-12-05 06:43 GMT

సింగిల్ జడ్జి ఉత్తర్వులపై తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు ధర్మాసనం తెలిపింది. స్వస్తిక్ ముద్ర తప్పించి వేరేవి చెల్లవని సింగిల్ జడ్జి ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హైకోర్టు ధర్మాసనాన్ని ఆశ్రయించారు.దీనివల్ల నేరేడ్ మెట్ ఎన్నికల ఫలితం నిలిచిపోయిందని పేర్కొంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ విషయంలో జోక్యం చేసుకోకూడదని తమ పిటీషన్ లో పేర్కొన్నారు. సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేయాలని పిటీషన్ లో కోరారు. కానీ హైకోర్టు ధర్మాసనం మాత్రం తాము సింగిల్ జడ్జి ఉత్తర్వులపై జోక్యం చేసుకోలేమని చెప్పింది. కాకుంటే రేపు దీనిపై విచారణ జరపాలని సింగిల్ జడ్జిని ధర్మాసనం కోరింది.

Tags:    

Similar News