బ్రేకింగ్ : మేం నిర్ణయించలేం
ఆర్టీసీ సమ్మెచట్ట విరుద్ధమని తాము ప్రకటించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. పబ్లిక్ యుటిలిటీ సర్వీస్ కాబట్టి ఎస్మా పరిధిలోకి వస్తుందని ప్రభుత్వ తరుపున న్యాయవాది హైకోర్టులో వాదించారు. [more]
;
ఆర్టీసీ సమ్మెచట్ట విరుద్ధమని తాము ప్రకటించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. పబ్లిక్ యుటిలిటీ సర్వీస్ కాబట్టి ఎస్మా పరిధిలోకి వస్తుందని ప్రభుత్వ తరుపున న్యాయవాది హైకోర్టులో వాదించారు. [more]
ఆర్టీసీ సమ్మెచట్ట విరుద్ధమని తాము ప్రకటించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. పబ్లిక్ యుటిలిటీ సర్వీస్ కాబట్టి ఎస్మా పరిధిలోకి వస్తుందని ప్రభుత్వ తరుపున న్యాయవాది హైకోర్టులో వాదించారు. అయితే పబ్లిక్ యుటిలిటీ సర్వీసులన్నీ అత్యవసర విభాగాలు కింద రావని హైకోర్టు తెలిపింది. ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధమని తాము చెప్పలేమని పేర్కొంది. సమ్మె అక్రమమా? సరైనదా? అన్నది తాము ఎలా నిర్ణయిస్తామని వ్యాఖ్యలు చేసింది. రూట్ల ప్రయివేటీకరణపై మంత్రి వర్గం ఆమోదించిన తీర్మానాన్ని ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించింది. తాము చర్చలు కొనసాగిస్తుండగానే ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెకు వెళ్లాయని ప్రభుత్వం వాదించింది. అయినా కార్మికులపై తాము ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొంది. రూట్ల ప్రయివేటీకరణ్ పై ఉన్న స్టేను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రూట్ల ప్రయివేటీకరణపై విచారణను రేపటికి హైకోర్టు వాయిదా వేసింది.