హైకోర్టుకు ఆ అధికారం లేదట

ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధమని ప్రభుత్వం హైకోర్టులో వాదించింది. ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి హైపవర్ కమిటీని నియమిస్తామని హైకోర్టు ప్రతిపాదనను ప్రభుత్వం [more]

;

Update: 2019-11-13 11:41 GMT

ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధమని ప్రభుత్వం హైకోర్టులో వాదించింది. ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి హైపవర్ కమిటీని నియమిస్తామని హైకోర్టు ప్రతిపాదనను ప్రభుత్వం తిరస్కరించింది. పునర్విభజన చట్ట ప్రకారం ఏపీఎస్ఆర్టీసీ విభజన జరగలేదని కేంద్రం చెబుతోంది. చట్టప్రకారమే విభజన జరిగిందని ప్రభుత్వం తెలిపింది. హైకోర్టుకు ఆర్టీసీ సమ్మెపై నిర్ణయం తీసుకునే అధికారం లేదని, కేవలం లేబర్ కమిషనర్ మాత్రమే నిర్ణయం తీసుకోగలదని ప్రభుత్వం తరుపున న్యాయవాది వాదించింది. దీంతో ఆర్టీసీ సమ్మెపై విచారణను ఈనెల 18వ తేదీకి వాయిదా వేసింది.

Tags:    

Similar News