జగన్ సర్కార్ కు హైకోర్టు షాక్
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ఇప్పుడున్న పరిస్థితుల్లో నిలుపుదల చేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. దీనిపై స్టే ఇవ్వడం సాధ్యం [more]
;
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ఇప్పుడున్న పరిస్థితుల్లో నిలుపుదల చేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. దీనిపై స్టే ఇవ్వడం సాధ్యం [more]
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ఇప్పుడున్న పరిస్థితుల్లో నిలుపుదల చేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. దీనిపై స్టే ఇవ్వడం సాధ్యం కాదని పేర్కొంది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఎన్నికల కమిషనర్ ను హైకోర్టు ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది. ఫిబ్రవరి నెలలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని ఎన్నికల కమిషనర్ ప్రయత్నాన్ని నిలుపుదల చేయాలంటూ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీంతో ఇక స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిందే.