వర్మ మర్డర్ సినిమాకు గ్రీన్ సిగ్నల్

రాంగోపాల్ వర్మ మర్డర్ సినిమాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమా విడుదలపై నల్లగొండ జిల్లా కోర్టు స్టే విధించింది. దీనిపై రాంగోపాల్ వర్మ హైకోర్టును [more]

Update: 2020-11-06 05:55 GMT

రాంగోపాల్ వర్మ మర్డర్ సినిమాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమా విడుదలపై నల్లగొండ జిల్లా కోర్టు స్టే విధించింది. దీనిపై రాంగోపాల్ వర్మ హైకోర్టును ఆశ్రయించారు. మిర్యాలగూడకు చెందిన అమృత, ప్రణయ్ లపై ఈ సినిమా తీస్తున్నట్లు గతంలో వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ప్రణయ్ కుటుంబ సభ్యులు నల్లగొండ కోర్టును ఆశ్రయించగా స్టే విధించారు. అయితే తమ కథకు అమృత, ప్రణయ్ యదార్థ ఘటనకు సంబంధం లేదని చిత్ర యూనిట్ హైకోర్టుకు తెలిపింది. దీంతో హైకోర్టు మర్డర్ సినిమా విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ సినిమాలో ప్రణయ్, అమృత, అమృతరావు పేర్లు వాడబోమని చిత్ర యూనిట్ కోర్టుకు తెలిపింది.

Tags:    

Similar News