బ్రేకింగ్ : నిమ్మగడ్డకు రిలీఫ్… ప్రభుత్వానికి షాక్

ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉద్యోగులపై సీఐడీ కేసులపై హైకోర్టు స్టే విధించింది. విచారణను నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. విచారణ ఎందుకు చేస్తున్నారో నివేదిక ఇవ్వాలని హైకోర్టు [more]

Update: 2020-09-07 08:01 GMT

ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉద్యోగులపై సీఐడీ కేసులపై హైకోర్టు స్టే విధించింది. విచారణను నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. విచారణ ఎందుకు చేస్తున్నారో నివేదిక ఇవ్వాలని హైకోర్టు సీఐడీని ఆదేశించింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ హోంశాఖకు రాసిన లేఖపై విచారణ జరిపేందుకు సీఐడీ ని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో టీడీపీ ప్రమేయం ఉందని అనుమానం. అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ తాజాగా తమ కార్యాలయ సిబ్బందిని సీఐడీ అధికారులు వేధిస్తున్నారని, కార్యాలయం నుంచి స్వాధీనం చేసుకున్న సామగ్రిని తమకు ఇవ్వాలని హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటీషన్ దాఖలు చేశారు. దీనికి స్పందించిన హైకోర్టు రాష్ట్ర ఎన్నికల అధికారి కార్యాలయ సిబ్బందిపై విచారణను నిలుపుదల చేయాలని ఆదేశించింది.

Tags:    

Similar News