బ్రేకింగ్ : ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి సీరియస్

రాష్ట్ర ప్రభుత్వంపై మరోసారి హైకోర్టు సీరియస్ అయింది. స్టేట్ ఎన్నికల కమిషనర్ విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు సరికాదన్నారు. రాజ్యాంగ బద్ధ సంస్థలను కాపాడుకోవాలని హైకోర్టు అభిప్రాపయపడింది. [more]

;

Update: 2020-11-03 06:41 GMT

రాష్ట్ర ప్రభుత్వంపై మరోసారి హైకోర్టు సీరియస్ అయింది. స్టేట్ ఎన్నికల కమిషనర్ విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు సరికాదన్నారు. రాజ్యాంగ బద్ధ సంస్థలను కాపాడుకోవాలని హైకోర్టు అభిప్రాపయపడింది. ప్రభుత్వాలు వస్తాయి వెళతాయని, రాజ్యంగసంస్థలు నిరంతరం కొనసాగుతాయని చెప్పారు. ఎస్సీకి ఉద్దేశ పూర్వకంగానే రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని పేర్కొంది. కనగరాజ్ లాయర్ ఖర్చు వివరాలను కోర్టుకు తెలియజేయాలని హైకోర్టు ఆదేశించింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానంలో ఏపీ ప్రభుత్వం కనగరాజ్ ను నియమించిన సంగతి తెలిసిందే. అయితే హైకోర్టులో వాదనకు కనగరాజ్ నియమించుకున్న న్యాయవాదులకు ఫీజు ఎవరు చెల్లించారని హైకోర్టు ప్రశ్నించింది. ఇది ప్రజాధనం కాదా అని ప్రశ్నించింది. అలాగే కనగరాజ్ నివాసానికి అయిన 20 లక్షల ఖర్చును సొంతంగా భరించుకోవాలని కూడా హైకోర్టు సూచించింది. కనగరాజ్ పెట్టిన ఖర్చును రాష్ట్ర ఎన్నికల కమిషన్ చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది.

Tags:    

Similar News