బ్రేకింగ్ : రాజధానిపై ఏపీ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు… ప్రజా ధనం…?

రాజధానిపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రాజధానిలో ఇప్పటి వరకూ ఎంత ఖర్చు చేశారో వివరాలివ్వాలని కోరింది. ఇప్పటి వరకూ ఎంత ఖర్చు చేశారు? అని హైకోర్టు [more]

;

Update: 2020-08-06 08:39 GMT

రాజధానిపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రాజధానిలో ఇప్పటి వరకూ ఎంత ఖర్చు చేశారో వివరాలివ్వాలని కోరింది. ఇప్పటి వరకూ ఎంత ఖర్చు చేశారు? అని హైకోర్టు ప్రశ్నించింది. 52 వేల విలువైన కాంట్రాక్టు పనులను వివిధ సంస్థలకు అప్పగించారని పిటీషనర్ పేర్కొన్నారు. అయితే ఇది ప్రజాసొమ్ము అని, ఇది వృధా కాదా? అని హైకోర్టు ప్రశ్నించింది. ఏ ఏ నిర్మాణాలు ఏ దశలో ఉన్నాయో తెలియజేయాలని ప్రశ్నించింది. పూర్తయిన భవనాలు శిధిలావస్థకు చేరుకోవా? అని ప్రశ్నించింది. ఎక్కడ నిర్మాణపనులు ఆగాయో చెప్పాలని కోరింద. ఏపీ అకౌంటెంట్ జనరల్ ను ఇంప్లీడ్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. విచారణను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది.

Tags:    

Similar News