హైకోర్టు సీరియస్
అమరావతిలో పోలీసులు మహిళల పట్ల వ్యవహరించిన తీరుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 144 సెక్షన్, పోలీస్ యాక్టు అమలు చేయవద్దని సుప్రీంకోర్టు సూచించినా ఎందుకు [more]
;
అమరావతిలో పోలీసులు మహిళల పట్ల వ్యవహరించిన తీరుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 144 సెక్షన్, పోలీస్ యాక్టు అమలు చేయవద్దని సుప్రీంకోర్టు సూచించినా ఎందుకు [more]
అమరావతిలో పోలీసులు మహిళల పట్ల వ్యవహరించిన తీరుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 144 సెక్షన్, పోలీస్ యాక్టు అమలు చేయవద్దని సుప్రీంకోర్టు సూచించినా ఎందుకు అమలు చేశారని ప్రశ్నించింది. రాజధాని ప్రాంతంలో పరేడ్ చేయాల్సిన పనేముందని నిలదీసింది. అయితే రాజధాని ప్రాంతంలో ప్రశాంత పరిస్థితులు ఉన్నాయని అడ్వకేట్ జనరల్ చెప్పారు. అయితే ఎందుకు పోలీసులను మొహరించాల్సి వచ్చిందని హైకోర్టు ప్రశ్నించగా ముందు జాగ్రత్తకోసమేనని ఏజీ చెప్పారు. 2014 నుంచి రాజధాని ప్రాంత గ్రామాల్లో 144వ సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉందని, దానిని తాము కొనసాగిస్తున్నామని ఏజీ వివరించారు. మహిళల నోరు ఎందుకు బలవంతంగా నొక్కాల్సి వచ్చిందని హైకోర్టు ప్రశ్నించింది.