ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై స్టే

ధరణి పోర్టల్‌లో నాన్ అగ్రికల్చర్‌ ప్రాపర్టీల వివరాలు నమోదుపై హైకోర్టు స్టే విధించింది. ధరణి పోర్టల్‌లో భద్రత పరమైన అంశాలపై దాఖలైన మూడు పిటిషన్‌లపై హైకోర్టులో విచారణ [more]

;

Update: 2020-11-03 08:44 GMT

ధరణి పోర్టల్‌లో నాన్ అగ్రికల్చర్‌ ప్రాపర్టీల వివరాలు నమోదుపై హైకోర్టు స్టే విధించింది. ధరణి పోర్టల్‌లో భద్రత పరమైన అంశాలపై దాఖలైన మూడు పిటిషన్‌లపై హైకోర్టులో విచారణ జరిగింది. ధరణి పోర్టల్‌లో నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీ వివరాలు నమోదు చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. భద్రతపరమైన నిబంధనలు పాటించుకుండా వ్యవసాయేతర భూముల వివరాలు నమోదు చేయడంతో భద్రత పరమైన ఇబ్బందులు తలెత్తుతాయని హైకోర్టు అభిప్రాయపడింది. గూగుల్ ప్లే స్టోర్‌లో ధరణి పోర్టల్ పోలిన మరో నాలుగు యాప్స్‌ ఉన్నాయన్న హైకోర్టు పేర్కొంది. దీంతో అసలు ధరణి పోర్టల్‌ ఏదో తెలిసుకోవడం ప్రజలకు ఇబ్బందిగా మారుతుందన్న హైకోర్టు వ్యాఖ్యానించింది. నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీలకు సంబంధించిన ఎలాంటి భద్రత పరమైన చర్యలు తీసుకుంటున్నారో తెలపాలన్న హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. రెండు వారాల్లో కౌంటర్‌ ద్వారా పూర్తి నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు కోరింది. అప్పటి వరకూ ఎలాంటి వివరాలు నమోదు చేయొద్దన్న హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఈనెల 20 కి వాయిదా వేసింది.

Tags:    

Similar News