స్థానిక ఎన్నికల నిర్వహణపై నేడు హైకోర్టులో

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నేడు హైకోర్టు విచారణ జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరించడం లేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ [more]

;

Update: 2020-12-22 02:56 GMT

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నేడు హైకోర్టు విచారణ జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరించడం లేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనుబంధ పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటం, కరోనా వ్యాక్సిన్ ను కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం పంపిణీ చేయాల్సి ఉండటంతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ప్రభుత్వం వాదిస్తుంది. దీనిపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.

Tags:    

Similar News