మర్కజ్ నుంచి వారు మిస్సయారట.. అలెర్ట్ చేసిన కేంద్ర ప్రభుత్వం
తబ్లిగి జమాతే వ్యవహారంలో బయటపడుతున్న కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. మర్కజ్ లో ప్రార్థనలకు వెళ్లి వచ్చిన రోహింగ్యాల జాడ తెలియడం లేదు. రోహింగ్యాల జాడ తెలుసుకోవాలంటూ [more]
తబ్లిగి జమాతే వ్యవహారంలో బయటపడుతున్న కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. మర్కజ్ లో ప్రార్థనలకు వెళ్లి వచ్చిన రోహింగ్యాల జాడ తెలియడం లేదు. రోహింగ్యాల జాడ తెలుసుకోవాలంటూ [more]
తబ్లిగి జమాతే వ్యవహారంలో బయటపడుతున్న కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. మర్కజ్ లో ప్రార్థనలకు వెళ్లి వచ్చిన రోహింగ్యాల జాడ తెలియడం లేదు. రోహింగ్యాల జాడ తెలుసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల ను ఆదేశించింది. ఢిల్లీలో మర్కజ్ ప్రార్థనలకు రోహింగ్యాలు కూడా హాజరయ్యారని కేంద్ర హోంశాఖ గుర్తించింది. హైదరాబాద్ రోహింగ్యాల క్యాంప్ నుంచి పలువురు హరియాణా మేవాత్‌లో జరిగిన జమాత్‌కు హాజరైనట్టు కేంద్ర నిఘా విభాగం అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ శివారు ప్రాంతంలోని బాలాపూర్ లో రోహింగ్యాల క్యాంపు ఉంది. ఢిల్లీలోని రోహింగ్యాలు సైతం జమాత్ కార్యాకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారని కేంద్రం చెబుతుంది. జమాత్‌కు వెళ్లిన రోహింగ్యాలు క్యాంపులకు తిరిగి చేరుకోలేదని కేంద్రం గుర్తించింది. ఇందుకు సంబంధించి దిద్దుబాటు చర్యలు కేంద్రం చేపట్టింది. రోహింగ్యాల క్యాంపు నుంచి మిస్సయిన వారిని వెతికి పట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దేశవ్యాప్తంగా రోహింగ్యా క్యాంపులున్న చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొని ఉంది. రోహింగ్యాల కదలికలు, వారి వివరాలు సేకరించాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం జారీ చేసింది. రోహింగ్యాలు అందరినీ స్క్రీనింగ్ చేసి వైద్య పరీక్షలు నిర్వహించాల్సిందిగా ఉత్తర్వులు జారీచేశారు. క్యాంపు లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తప్పనిసరిగా వైద్య పరీక్షలు నిర్వహించాలని కేంద్రం ఆదేశించింది.