వేపకు పెరిగిన డిమాండ్.. ఎకరానికి రూ.15వేలు ఆదాయం !

వేప గింజలకు డిమాండ్ మరింత పెరిగింది. సేంద్రీయసాగులో వేపను ఎక్కువగా వినియోగిస్తుండటం దాని డిమాండ్ ను పెంచుతోంది. ఫలితంగా మన వద్ద కావాల్సినంత దిగుబడి లేక.. విదేశాల నుంచి

Update: 2021-12-27 06:13 GMT

ఔషధ నిలయానికి నెలవైన వేప వృక్ష సంపద తగ్గిపోతోంది. రోడ్డుకు అడ్డంగా ఉన్నాయనో.. సరిహద్దులో అడ్డమొచ్చిందనో.. ఇలా అడ్డంగా ఉన్న వేపచెట్లను కొట్టేస్తున్నారు. దీంతో వేప వృక్ష సంపద తరిగిపోతుండగా.. వేప గింజలకు డిమాండ్ మరింత పెరిగింది. సేంద్రీయసాగులో వేపను ఎక్కువగా వినియోగిస్తుండటం దాని డిమాండ్ ను పెంచుతోంది. ఫలితంగా మన వద్ద కావాల్సినంత దిగుబడి లేక.. విదేశాల నుంచి వేపగింజలను దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

30 దేశాల్లో మాత్రమే వేపచెట్లు
కానీ.. 30 దేశాల్లో మాత్రమే వేపచెట్లు ఉండటంతో దిగుమమతి అవకాశాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. దీంతో దేశీయంగానే వేపసాగును ప్రోత్సహించాలని నిర్ణయించింది కేంద్రం. ఈ మేరకు రాష్ట్రాలను వేప సాగును పెంచాలని కోరింది. దేశవ్యాప్తంగా 3.5 కోట్ల వేప మొక్కలను నాటించాలని కేంద్రం టార్గెట్ ఫిక్స్ చేసింది. ఒక ఎకరంలో 20 వరకూ వేప మొక్కలను నాటుకుని.. వాటి మధ్యలో ఇతర పంటలను యథావిధిగా సాగుచేసుకోవచ్చని సూచించింది. ఇలా చేయడం వల్ల రైతుకు రెండు రకాలుగా ఆదాయం వస్తుంది. ఒక్కో వేపచెట్టు 50 కిలోల వరకూ గింజలను ఇస్తే.. కిలో గింజలను ఇఫ్కో రూ.15 చొప్పున కొనుగోలు చేస్తుంది. ఇలా ఎకరాకు రూ.15 వేల వరకూ అదనపు ఆదాయం సమకూరుతుంది.
వేప గింజలతో ఉపయోగాలు
వేప గింజల్లోని అజాడిరచ్ట అనే కెమికల్ పంట తెగుళ్లను అరికట్టడంలో మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే యూరియాతో పాటు వేపనూనెను కూడా విక్రయించడాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పని సరి చేసింది. ఈ నేపథ్యంలో ఏడాదికి 22 వేల టన్నుల వేపనూనె అవసరం ఉంటుందని కేంద్రం అంచనా. అంత పెద్ద మొత్తంలో వేపనూనెను తయారు చేయాలంటే.. కొన్ని లక్షల క్వింటాళ్లలో వేప గింజలు కావాల్సి ఉంటుంది. అందుకే దేశీయంగా వేప చెట్ల పెంపకానికి కేంద్రం శ్రీకారం చుట్టింది.


Tags:    

Similar News