తెలంగాణ ఎన్నికలపై ఇండియా టుడే సర్వే

Update: 2018-12-05 07:40 GMT

ఓ వైపు లగడపాటి రాజగోపాల్ రాష్ట్రంలో కాంగ్రెస్ కి అనుకూల పవనాలు వీస్తున్నాయని చెబుతుండగా... జాతీయ మీడియా సంస్థలు మాత్రం మొగ్గు టీఆర్ఎస్ కే ఉంటుందని అంచనాలు వేస్తున్నాయి. టీఆర్ఎస్ గెలుస్తుందని మొన్న ఎన్టీడీవీ అంచనా వేసింది. తాజాగా మరో జాతీయ ఛానల్ ఇండియా టుడే కూడా ఇదే రకమైన విశ్లేషణ చేసింది. పొలిటికల్ స్టాక్ ఎక్సేంచ్ పేరిట యాక్సిస్ మై ఇండియా సంస్థతో ఇండియా టుడే చేసిన సర్వేలో ఆసక్తికర ఫలితాలు వెల్లడయ్యాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ గెలవాలని 48 శాతం ప్రజలు కోరుకుంటుండగా... 38 శాతం మంది మాత్రం ప్రభుత్వం మారాలని ఆశిస్తున్నారు. ఇక 14 శాతం మంది చెప్పలేమని అన్నారు.

కేసీఆర్ మళ్లీ రావాలన్న 46 శాతం మంది...

కాబోయే సీఎంగా 46 శాతం మంది కేసీఆర్ కావాలని కోరుకుంటుండగా... 25 శాతం మంది ఉత్తమ్ కుమార్ రెడ్డి కావాలని, జి.కిషన్ రెడ్డి కావాలని 16 శాతం మంది, ప్రొ.కోదండరాం కావాలని 7 శాతం మంది, అసదుద్దిన్ ఓవైసీ కావాలని 4 శాతం మంది ఆశించారు. అయితే, సెప్టెంబర్ లో కేసీఆర్ వైపు 43 శాతం మంది ఉండగా ఇప్పుడు 46కి పెరిగింది. అదే సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డికి సెప్టెంబర్ లో 18 శాతం మంది మద్దతు ఇవ్వగా ఇప్పుడు 25 శాతానికి పెరిగింది. మొత్తానికి మాత్రం రాష్ట్రంలో సుమారు సగం మంది కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలని భావిస్తున్నారని ఇండియా టుడే సర్వేలో స్పష్టమైంది.

Similar News