తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల తుదిజాబితా ఇంకా రూపుదిద్దుకోలేదు. రెండురోజుల నుంచి వార్ రూమ్ లో అభ్యర్థుల ఎంపికపై చర్చోప చర్చలు జరుపుతున్న పార్టీ పెద్దలు కొన్ని నియోజవర్గాలపై అభ్యర్థుల ఎంపికలో ఏకాభిప్రాయానికి రాలేకపోయింది. స్క్రీనింగ్ కమిటీ రూపొందించిన జాబితాను సోనియాగాంధీ నివాసంలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ పరిశీలించింది. ఇప్పటి వరకూ 74 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులకు ఖరారు చేసింది.
మిత్రపక్షాలకు దక్కే సీట్లివే....
టీడీపీకి 14, తెలంగాణ జనసమితికి 8 స్థానాలను, సీపీఐకి మూడు, తెలంగాణ యువ పార్టీకి ఒక స్థానాన్ని కేటాయించడానికి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అంగీకరించారని తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి కుంతియా తెలపిారు. ఈ నెల10వ తేదీను అభ్యర్ధుల తొలి జాబితాను విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. మిగిలిన జాబితాను 12, 13వ తేదీల్లో వెల్లడిస్తామని కుంతియా చెప్పారు.