కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్ల ఖరారు వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో స్క్రీనింగ్ కమిటీ భేటీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉదయం నుంచి మంతనాలు సాగిస్తూనే ఉన్నారు. రిజర్వ్ డ్ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై ఒక అభిప్రాయానికి వచ్చిన నేతలు, జనరల్ స్థానాల్లోనే కొంత కిందా మీదా పడాల్సి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ మొత్తం 95 స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవహరాల ఇన్ ఛార్జి కుంతియా, జానారెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, షబ్బీర్ ఆలి లు ఈ సమావేశంలో పాల్గొని అభ్యర్థుల ఎంపికపై చర్చలు జరుపుతున్నారు. ఈ నెల 9వ తేదీన అభ్యర్థులను ప్రకటించాలన్న ఉద్దేశ్యంలో కాంగ్రెస్ పార్టీ ఉంది.