ఇన్ స్టాగ్రామ్ లో సెక్స్ ప్రపోజల్... హాస్టల్ కి రమ్మని చెప్పి...?

Update: 2018-08-22 13:31 GMT

సోషల్ మీడియా అమ్మాయిలపై లైంగిక వేదింపులు, బెదిరింపులకు కారణమవుతోంది. మంచి కంటే చెడు ఎక్కువ చేస్తోంది. తాజాగా, ఇటువంటి సంఘటనే ఒకటి హైదరాబాద్ లో జరిగింది. వరంగల్ లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న అబ్బాయి, హైదరాబాద్ లో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న అమ్మాయి ఇన్ స్టాగ్రామ్ లో స్నేహితులయ్యారు. కొన్ని రోజులు చాటింగ్ చేసుకున్నారు. ఇది అలుసుగా తీసుకున్న సదరు అబ్బాయి అమ్మాయికి ప్రేమ ప్రపోజల్ చేశాడు. దీనిని అమ్మాయి తిరస్కరించింది. దీంతో ఆగ్రహించిన అబ్బాయి తనతో సెక్స్ చేయాలని ఇన్ స్టాగ్రామ్ లోనే ప్రపోజ్ చేశాడు.

హాస్టల్ రూమ్ లోకి పిలిచి...

సెక్స్ ప్రపోజల్ చూసి షాకైన అమ్మాయి.. ఆకతాయికి సరిగ్గా బుద్ధి చెప్పాలని భావించింది. ప్రపోజల్ కు ఓకే చెప్పి హైటెక్ సిటీ ప్రాంతంలోని తన హాస్టల్ వద్దకు రావాలని చెప్పింది. దీంతో రెక్కలు కట్టుకుని హైదరాబాద్ లో దిగాడు కుర్రాడు. అమ్మాయి ఉండే హాస్టల్ వద్దకు వెళ్లాడు. అప్పటికే ఆరుగురు తోటి విద్యార్థినులతో రెడీగా ఉన్న అమ్మాయి... అతడిని హాస్టల్ రూంలోకి తీసుకెళ్లింది. విద్యార్థినులు అందరు కలిసి అబ్బాయికి దేహశుద్ధి చేశారు. అబ్బాయి తీవ్ర గాయాలపాలయ్యాడు. చికిత్స కోసం ఆసుపత్రిలో చేరగా... దాడి ఘటన కావడంతో ఆసుపత్రి సిబ్బంది మాధాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అబ్బాయి స్టేట్ మెంట్ తీసుకుని ఆరుగురు అమ్మాయిలపై కేసు నమోదు చేసుకున్నారు. అమ్మాయి సైతం తనను వేదించారని ఫిర్యాదు చేయడంతో అబ్బాయిపై కేసు పెట్టారు. అయితే, విషయం తెలుసుకున్న ఇద్దరి తల్లిదండ్రులు తమ పరువు పోతుందని, కేసును విత్ డ్రా చేసుకుంటామని పోలీసులను బతిమాలుతున్నారు.

Similar News