ఊహించని నిబంధనలు .. ఐటీ ఉద్యోగుల్లో వణుకు

ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ విషయంలో నిబంధనలు మరింత కఠినతరం అవుతున్నాయి. దేశంలో ట్యాక్స్‌ ఎగ్గొట్టే వారు పెరిగిపోవడంతో..;

Update: 2023-08-09 04:57 GMT

ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ విషయంలో నిబంధనలు మరింత కఠినతరం అవుతున్నాయి. దేశంలో ట్యాక్స్‌ ఎగ్గొట్టే వారు పెరిగిపోవడంతో కేంద్ర సర్కార్‌ మరింత చర్యలకు దిగుతోంది. ఆదాయపు పన్ను విషయంలో కొత్త కొత్త నిబంధనలు రూపొందిస్తోంది ఐటీ శాఖ. ఇప్పుడు ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ దెబ్బకు ఐటీ ఉద్యోగుల్లో వణుకు పుడుతోంది. అందుకు కారణం ఐటీ శాఖ జారీ చేసిన నోటీసులు. ఇప్పుడు మూన్‌ లైటింగ్‌ గురించి చెప్పుకోవాలి. దీని గురించి పెద్దగా పరిచయం చేసుకోవాల్సిన అవరం లేదు. ఇది అందికి తెలిసిందే. కరోనా మహమ్మారి సమయంలో లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ సమయంలో ఎంతో మంది ఐటీ ఉద్యోగులు వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌కు పరిమితం అయ్యారు. కొందరు ఉద్యోగులు ఒకేసారి రెండు ఉద్యోగాలు చేస్తూ అధిక మొత్తంలో సంపాదించుకున్నారు. అయితే ఇటీవల కాలంలో అసలు విషయం వెలుగులోకి రావడంతో ఐటీ రంగం వణికేలా చేసింది. తాజాగా మూన్‌లైటింగ్‌ మరోసారి వెలుగులోకి రావడంతో ఐటీ ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. దీంతో ఆదాయపు పన్ను శాఖ ప్రత్యేక నిఘా పెట్టింది. అసలు ఏం జరుగుతుందనే దానిపై ఫోకస్‌ పెట్టింది ఐటీశాఖ.

ఐటీ రిటర్న్‌లో చూపించని ఆదాయంపై నిఘా..

ఎకనామిక్‌ టైమ్స్‌లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. కరోనా లాక్‌డౌన్‌ సమయం నుంచి వర్క్‌ఫ్రం హోమ్‌ చేస్తున్న ఉద్యోగులు అధిక మొత్తంలో సంపాదిస్తున్నట్లు ఐటీ శాఖ గుర్తించింది. విషయం ఏంటంటే.. మూన్‌లైటింగ్‌ ద్వారా ఎక్కువ మొత్తంలో సంపాదించిన ఆదాయాన్ని ఐటీ రిటర్న్‌లో చూపించలేదట. ఇందుకు ఉద్యోగులు ఇప్పుడు చిక్కుల్లో పడే పరిస్థితి వచ్చింది. దీనిపై ప్రత్యేక దృష్టి సారించిన ఐటీ శాఖ ఆయా ఉద్యోగులకు నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతానికి 2019-20, 2020-21 ఆర్థిక సంవత్సరానికి గానూ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అధికారులు ఈ నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు ఈ నోటీసులు అందుకున్న ఐటీ ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అధికారులు ఎలాంటి సమాధానం చెప్పాలో తెలియక ఆందోళన పడిపోయారు ఉద్యోగులు. మూన్‌లైటింగ్ ద్వారా అధిక మొత్తంలో రాబడి పొందుతున్న వారిలో ఐటీ సెక్టార్‌, అకౌంటింగ్‌ మేనెజ్‌మెంట్‌ ప్రోఫెసర్లు ఉన్నారని తెలుస్తోంది.

విదేశాల నుంచి నగదు బదిలీ అయిన వారు చాలా మందే..

కాగా, ఐటీ నోటీసులు అందుకున్న ఉద్యోగుల్లో చాలా మంది విదేశాల నుంచి నగదు బదిలీ అయిన వారు ఉన్నారని ఐటీ శాఖ గుర్తించింది. వారి సాధారణ సాలరీపై మాత్రమే ట్యాక్స్‌ చెల్లింపులు చేశారు. కానీ మూన్‌లైటింగ్‌ సంపాదనపై ఎలాంటి వివరాలు అందించలేదు. ఇలాంటి వారిపై ఐటీ శాఖ కన్నేసి నోటీసులు జారీ చేసింది. అయితే ఈ నోటీసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. అసలు విషయం ఏంటంటే ఈ మూన్‌లైటింగ్‌ ద్వారా సంపాదిస్తున్న చాలా మంది ఉద్యోగుల వివరాలు వారు పని చేస్తున్న కంపెనీలే ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అధికారులకు అందించాయి. ఈ నేపథ్యంలో వారు విదేశీ లావాదేవీలను ట్రాక్‌ చేయడంలో ఐటీ శాఖ సులభంగా గుర్తించింది. ఈ ఉద్యోగులపై ఐటీ శాఖ స్పెషల్‌ ఫోకప్‌ పెట్టడంలో ఇప్పుడు ఐటీ ఉద్యోగుల్లో మరింత ఆందోళన మొదలైందనే చెప్పాలి.

Tags:    

Similar News