టైం కాదు.. టైమింగ్‌ ముఖ్యం!

‘స్కిల్‌’ కుంభకోణం కేసులో చంద్రబాబు అరెస్ట్‌ హఠాత్మరిణామం కాదు. జగన్‌ ప్రభుత్వం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న సమయమిది. చంద్రబాబు లాంటి నేతలను అరెస్ట్‌ చేయాలంటే టైం ఒక్కటే చాలదు... టైమింగ్‌ కూడా కావాలి. ముఖ్యమంత్రి జగన్‌ దేశంలో లేని సమయంలో, జీ`20 సదస్సులో జాతీయ మీడియా బిజీగా ఉన్న సమయంలో తెలుగుదేశం అధినేతను అదుపులోకి తీసుకుని అధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. 118 కోట్ల రూపాయలకు సంబంధించి ఐటీ శాఖ నుంచి చంద్రబాబుకు నోటీసులు రావడంతో.. ‘పెద్దాయన’ అరెస్ట్‌కు టైం వచ్చిందని జగన్‌ సర్కార్‌ నిర్ణయించుకుంది.

Update: 2023-09-10 03:28 GMT

చంద్రబాబు అరెస్ట్‌పై జగన్‌ వ్యూహాత్మకంగా అడుగులు

‘స్కిల్‌’ కుంభకోణం కేసులో చంద్రబాబు అరెస్ట్‌ హఠాత్మరిణామం కాదు. జగన్‌ ప్రభుత్వం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న సమయమిది. చంద్రబాబు లాంటి నేతలను అరెస్ట్‌ చేయాలంటే టైం ఒక్కటే చాలదు... టైమింగ్‌ కూడా కావాలి. ముఖ్యమంత్రి జగన్‌ దేశంలో లేని సమయంలో, జీ`20 సదస్సులో జాతీయ మీడియా బిజీగా ఉన్న సమయంలో తెలుగుదేశం అధినేతను అదుపులోకి తీసుకుని అధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. 118 కోట్ల రూపాయలకు సంబంధించి ఐటీ శాఖ నుంచి చంద్రబాబుకు నోటీసులు రావడంతో.. ‘పెద్దాయన’ అరెస్ట్‌కు టైం వచ్చిందని జగన్‌ సర్కార్‌ నిర్ణయించుకుంది.

హిందుస్తాన్‌ టైమ్స్‌లో చంద్రబాబు ఐటీ నోటీసుల విషయం పబ్లిష్‌ కావడంతో తెలుగుదేశం శిబిరంలో స్తబ్ధత నెలకొంది. చంద్రబాబుకు ఆత్మీయులైన పురంధేశ్వరి, పవన్‌ కళ్యాన్‌, తెలుగుదేశం అనుకూల మీడియా... అదేదో చిన్న విషయమన్నట్లు విస్మరించాయి. అయితే వైసీపీ నేతలు మాత్రం ఈ అవకాశాన్ని వాడుకున్నారు. సోషల్‌ మీడియా యుగంలో ఐటీ నోటీసుల విషయం సామాన్యుడికి కూడా తెలిసిపోయింది. ‘ఇనుము వేడిగా ఉన్నప్పుడే గట్టిగా కొట్టాలి’ అని ఆంగ్లంలో ఓ సామెత ఉంది. వెంటనే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం రికార్డుల బూజు దులిపారు సీఐడీ అధికారులు.

తన అరెస్ట్‌కు రంగం సిద్ధమవుతోందనే విషయం చంద్రబాబుకు తెలిసిపోయింది. రాయదుర్గంలోని ఓ సభలో ‘నన్ను రెండు, మూడు రోజుల్లో అరెస్ట్‌ చేయొచ్చు’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి జగన్‌ లండన్‌లో ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్‌ సమయంలో జగన్‌ ఏపీలో ఉండి ఉంటే, తెలుగుదేశం నేతలంతా జగన్‌ను వ్యక్తిగతంగా నిందించేవారు. తాడేపల్లిలోని సీఎం ఇంటి ముందు ధర్నాలు చేసి, మీడియా ఫోకస్‌ను అటు మళ్లించేవారు. పోలీసులు వారికి అడ్డు పడటం, అరెస్ట్‌ చేయడం లాంటివి జరిగి... జగన్‌ సర్కార్‌ దౌర్జన్యం అంటూ వార్తలతో మీడియా మరింత హైప్‌ క్రియేట్‌ చేసేది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని ప్రసార మాధ్యమాల ఫోకస్‌ అంతా చంద్రబాబు మీద మాత్రమే ఉంది. లోకేష్‌ లాంటి వాళ్లు ‘పిచ్చోళ్లు లండన్‌లో, మంచోళ్లు జైల్‌లో’ అంటూ కామెంట్లు చేసినా, దానికి అంత మైలేజీ రాలేదు.

జాతీయ స్థాయిలో కూడా చంద్రబాబు అరెస్ట్‌కు పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు. ఢల్లీిలో జీ`20 దేశాల సదస్సు జరుగుతుండటంతో, మీడియా ఫోకస్‌ అంతా అటే ఉంది. జీ`20 లాంటి అంతర్జాతీయ అంశం లేకపోతే చంద్రబాబు అంశం జాతీయ స్థాయిలో సంచలనం అయి ఉండేది. ప్రస్తుత పరిస్థితుల్లో జాతీయ మీడియాకు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన విషయం పెద్ద ప్రాధాన్యం కాదు. జాతీయస్థాయిలో పత్రికలు, చానళ్లు ఈ విషయాన్ని ప్రస్తావించాయి. ఓ రాష్ట్ర అంశంగానే చూసి, ఒకట్రెండు వార్తలతో సరిపెట్టాయి. ఈ విధంగా చంద్రబాబు అరెస్ట్‌ విషయంలో టైం, టైమింగ్‌ను కూడా జగన్‌ సర్కార్‌ బాగానే ఫాలో అయింది. చంద్రబాబు అరెస్ట్‌ విషయంలో జగన్‌ తన పంతం నెగ్గించుకున్నా, ఇది వైసీసీకి ప్లస్సా.. మైనస్సా అనేది కాలమే నిర్ణయిస్తుంది.

Tags:    

Similar News