జగన్ అప్ డేటెడ్… చంద్రబాబు అవుట్ డేటెడ్

వైసీపీ అధినేత జగన్ అప్ డేటెడ్ వర్షన్ అని… చంద్రబాబు నాయుడు అవుట్ డేటెడ్ వర్షన్ అని వైసీపీ ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. చంద్రబాబు ఎక్స్పైర్ అయిన [more]

;

Update: 2019-01-29 12:43 GMT

వైసీపీ అధినేత జగన్ అప్ డేటెడ్ వర్షన్ అని… చంద్రబాబు నాయుడు అవుట్ డేటెడ్ వర్షన్ అని వైసీపీ ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. చంద్రబాబు ఎక్స్పైర్ అయిన టాబ్లెట్ వంటి వారన్నారు. మంగళవారం పశ్చిమగోదావరి జిల్లాలో జరగిన నిన్ను నమ్మం బాబు కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ… సాధారణంగా పరీక్షల్లో కాపీ కొట్టిన వారిని డీబార్ చేస్తారని… వైసీపీ హామీలను కాపీ కొడుతున్న చంద్రబాబును ఏం చేయాలని ఆమె ప్రశ్నించారు. 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు… 40 ఏళ్ల వయసున్న జగన్ హామీలను కాపీ కొడుతున్నారని ఎద్దేవా చేశారు. బాబు వస్తే జాబు వస్తుందని ఎన్నికల ముందు ప్రచారం చేసుకున్న ఆయన కేవలం తన కుమారుడికి మాత్రమే మంత్రి పదవి ఇచ్చుకున్నారని విమర్శించారు. చంద్రబాబు కేవలం ఎన్నికల వరకు మూడు నెలలు మాత్రమే రూ.2000 వేలు పింఛన్ ఇస్తారని.. జగన్ గెలిస్తే జీవితాంతం ఇస్తారిన పేర్కొన్నారు.

Tags:    

Similar News