ఎల్లుండి పవన్ కల్యాణ్ దీక్ష
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరించవద్దంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ దీక్షకు దిగుతున్నారు.;
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరించవద్దంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ దీక్షకు దిగుతున్నారు. ఎల్లుండి మంగళగిరి పార్టీ కార్యాలయంలో విశాఖ ఉక్కు పరిరక్షణ దీక్ష చేపడుతున్నారు. పవన్ కల్యాణ తో పాటు ఈ దీక్షలో పీఏసీ సభ్యులు, జిల్లా పార్టీ నేతలు పాల్గొననున్నారు. కార్మికులకు అండగా ఉండేందుకే ఈ దీక్షను చేపడుతున్నట్లు పవన్ కల్యాణ్ వెల్లడించారు.
విశాఖ ఉక్కు కోసం...
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని రకాలుగా చర్యలు కూడా ప్రారంభించింది. పవన్ కల్యాణ‌్ దీనికి వ్యతిరేకిస్తూ కార్మికులతో కలసి ఒకరోజు ధర్నాలో పాల్గొననున్నారు. ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలసి విశాఖ ఉక్కును ప్రయివేటీకరించవద్దని కోరి కూడా వచ్చారు. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. బీజేపీతో మిత్రపక్షంగా ఉన్నా దీక్షకు దిగుతున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించడం విశేషం.