నేడు తూర్పుగోదావరికి పవన్
నేడు తూర్పు గోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు
నేడు తూర్పు గోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరామర్శించనున్నారు. నష్టపోయిన రైతులను పవన్ పరామర్శించనున్నారు. గత కొద్ది రోజులుగా సినిమా షూటింగ్‌లలో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్ రైతు సమస్యలపై స్పందించేందుకు ముందుకు వచ్చారు.
రైతులతో ముఖాముఖి...
పవన్ కల్యాణ్ తూర్పు గోదావరి జిల్లా పర్యటన ఏర్పాట్లను పార్టీ నేతలను పర్యవేక్షిస్తున్నారు. జనసేన కార్యకర్తలు కూడా వేలాది మంది తరలి వస్తారని భావించిన పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆవిడి, రాజుపాలెంలో ముఖాముఖి కార్యక్రమాల్లో పవన్ పాల్గొంటారని పార్టీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
షెడ్యూల్ ఇదీ...
ఈరోజు పవన్ కళ్యాణ్ ఉదయం 10 గంటలకు రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకుంటారు. 11:30 గంటలకు కడియం ఆవలో పంటలను పరిశీలించనున్నారు. కడియం గ్రామ రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం1:30 గంటలకు కొత్తపేట నియోజకవర్గం అవిడి గ్రామంలో రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మధ్యాహ్నం3.30 గంటలకు పి గన్నవరం నియోజకవర్గం రాజులపాలెం గ్రామంలో వరి, మొక్కజొన్న పంటలు పరిశీలించిన అనంతరం రాత్రి రాజమండ్రి షెల్టన్ హోటల్ లో బస చేస్తారు.