ఎవరికైనా దేశప్రయోజనాలే ముఖ్యమని, అందుకే చంద్రబాబు కాంగ్రెస్ తో జత కట్టారని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అభిప్రాయపడ్డారు. దేశంలో నియంతృత్వ పోకడలు హెచ్చుమీరిపోయాయన్నారు. కాంగ్రెస్ కంటే బీజేపీ అత్యంత ప్రమాదకరమైనదన్నారు కేఈ. దేశం సంక్షోభంలో ఉన్నప్పుడల్లా టీడీపీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. బీజేపీని దేశం నుంచి తరిమేయడానికే కాంగ్రెస్ తో చంద్రబాబు కలసి నడవాల్సి వస్తుందన్నారు. ఇందులో పెద్దగా తప్పు పట్టాల్సిన అవసరం లేదని కేఈ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు భిన్న అభప్రాయాలున్న పార్టీలు ఒకే వేదికపైకి వస్తున్నాయన్నారు. సిద్ధాంతం కన్నా దేశ ప్రయోజనాలే ముఖ్యమని కేఈ ముక్తాయించారు.