బయటపడిన బోటు

గోదావరిలోని కచ్చులూరు వద్ద మునిగిపోయిన వశిష్ట బోటును ఎట్టకేలకు వెలికితీశారు. నెలరోజులుగా బోటును వెలికి తీసేందుకు ప్రయత్నించారు. మొత్తానికి బోటు ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. గత నెల [more]

;

Update: 2019-10-22 09:10 GMT

గోదావరిలోని కచ్చులూరు వద్ద మునిగిపోయిన వశిష్ట బోటును ఎట్టకేలకు వెలికితీశారు. నెలరోజులుగా బోటును వెలికి తీసేందుకు ప్రయత్నించారు. మొత్తానికి బోటు ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. గత నెల సెప్టెంబర్ 15న సందర్శకులతో బయలుదేరిన వశిష్టబోటు ప్రమాదవశాత్తు గోదావరి నదిలో మునిగిపోయింది. దాదాపు యాభై మందికి పైగానే మృత్యువాత పడ్డారు. కొందరి మృతదేహాలు కూడా బయటపడలేదు. అప్పటి నుంచి బోటును వెలికితీసేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. రోప్ లు, లంగర్లను వేసి ప్రయత్నాలు చేశారు. చివరికి కాసేపటి క్రితం ధర్మాడ సత్యం బృందం బోటును వెలికితీసింది. 38రోజులుగా బోటునీ ళ్లల్లోనే ఉండడంతో పూర్తిగా శిథిలమైంది.

 

Tags:    

Similar News