త్వరలోనే నిమ్మగడ్డపై నిర్ణయం

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష‌ కుమార్ పై విచారణ జరిపే అధికారం తమకు ఉందని ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ కాకాణి గోవర్థన్ రెడ్డి తెలిపారు. మంత్రులను [more]

;

Update: 2021-02-03 01:11 GMT
కాకాణి గోవర్థన్ రెడ్డి
  • whatsapp icon

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష‌ కుమార్ పై విచారణ జరిపే అధికారం తమకు ఉందని ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ కాకాణి గోవర్థన్ రెడ్డి తెలిపారు. మంత్రులను కించపర్చారన్న వారి నోటీసులను తాము స్వీకరించామని ఆయన తెలిపారు. మహారాష్ట్రలోనూ ఇదే అంశంపై అక్కడి ఎన్నికల కమిషనర్ అరెస్ట్ అయ్యారన్న విషయాన్ని కాకాణి గోవర్థన్ రెడ్డి గుర్తు చేశఆరు. నిమ్మగడ్డ గవర్నర్ కు ఫిర్యాదు చేయడంతో పాటు ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా సభాహక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని కాకాణి గోవర్థన్ రెడ్డి తెలిపారు.

Tags:    

Similar News