జమ్మూ కాశ్మీర్ లో మళ్లీ అల్లర్లు చెలరేగాయి. నేడు బక్రీద్ సందర్భంగా అల్లరి మూకలు రెచ్చిపోయాయి. మసీదులో ప్రార్థనలు ముగియగానే భద్రతాదళాలపై రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు భాష్షవాయువును ప్రయోగించారు. కుల్గామ్ లో ఒక పోలీస్ కానిస్టేబుల్ ను ఉగ్రవాదులు కాల్చి చంపడంతో మళ్లీ ఉద్రిక్తత చెలరేగింది. టెర్రరిస్టును పోలీసులు కాల్చి చంపారు. శ్రీనగర్ లోనూ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఐసిస్, పాక్ జెండాలను ప్రదర్శిస్తూ అల్లరి మూకలు పోలీసులపై రాళ్లు రువ్వుతున్నాయి. దీంతో అదనపు బలగాలను రంగంలోకి దించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.