తెలంగాణ అసెంబ్లీని రద్దు చేస్తూ తీర్మాణం తీసుకున్న తర్వాత కేసీఆర్ గవర్నర్ నరసింహన్ ను కలిసి తీర్మాణాన్ని అందజేశారు. కేసీఆర్ ఒక్కరే గవర్నర్ ను కలిసి సుమారు 30 నిమిషాలు భేటీ అయ్యారు. అయితే, ఎన్నికలు పూర్తయి కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ నరసింహాన్ కు కోరారు. ఇందుకు కేసీఆర్ కూడా అంగీకరించారు. అయితే, ఇదంతా కేసీఆర్ ముందు రచించిన వ్యూహమే. అసెంబ్లీ రద్దు చేసినా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గా కొనసాగాలని ఆయన భావించారు. గవర్నర్ తో భేటీ జరుగుతుండగానే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ కార్యాలయం నుంచి లేఖ బయటకు వచ్చింది.