టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి సన్నిహుతుడు, ఆపద్ధర్మ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డికి ఆశాభంగం తప్పేలా లేదు. నాయిని నరసింహారెడ్డి అల్లుడు, రాంనగర్ కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి ముషిరాబాద్ టిక్కెట్ ఆశించారు. అయితే, ఇదే స్థానం కోసం మరో నేత ముఠా గోపాల్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గతంలో తాను ప్రాతినిథ్యం వహించిన స్థానాన్ని ఇప్పుడు తన అల్లుడికి ఇవ్వాలని నాయిని పట్టుబట్టారు. ఓ దశలో తన అల్లుడికి ఇవ్వడం కుదరకపోతే తన స్థానాన్ని తనకే కేటాయించాలని కూడా స్పష్టం చేశారు. దీంతో ఇప్పటివరకు ఈ స్థానం ఎవరికి అనేది తేల్చలేదు. ఇవాళ ఈ టిక్కెట్ కేటాయించాలని నిర్ణయించిన అధినేత కేసీఆర్ నాయినిని పిలిపించుకుని మాట్లాడారు. అయితే, ముఠా గోపాల్ వైపు మొగ్గు చూపుతున్న కేసీఆర్ నాయిని నరసింహారెడ్డిని బుజ్జగించినట్లు తెలుస్తోంది.