కక్ష అందుకేనటగా

ఆర్టీసీ సమ్మె 25రోజులకు చేరుకుంది. అయినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లుకూడా కావడం లేదు. ప్రజలు రోజు రోజుకు బస్సులు లేక అల్లాడిపోతున్నా ఆ సమస్యలేవీ సర్కారు పట్టించుకోవడం లేదు. [more]

Update: 2019-10-30 09:30 GMT
ఆర్టీసీ సమ్మె
  • whatsapp icon

ఆర్టీసీ సమ్మె 25రోజులకు చేరుకుంది. అయినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లుకూడా కావడం లేదు. ప్రజలు రోజు రోజుకు బస్సులు లేక అల్లాడిపోతున్నా ఆ సమస్యలేవీ సర్కారు పట్టించుకోవడం లేదు. కోర్టు పలుమార్లు మెట్టికాయలు వేసినా ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం కోర్టు ఏమైనా కొడుతుందా అంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యల పట్ల ఆయన వైఖరి ఏంటో అర్థమవుతోంది. ఆర్టీసీని ప్రైవేటు పరం చేయడానికే ముఖ్యమంత్రి ఇలా చేస్తున్నారాననే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.

ఎందుకీ కక్ష్య…

ఎవరడిగినా వరాలిచ్చే ముఖ్యమంత్రి ఆర్టీసీపైనే ఎందుకు కన్నెర్ర చేస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. అడగని వాళ్లకు కూడా కోట్లరూపాయలు కట్టబెట్టే సీఎం కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో ఇచ్చిన హామీలనే ఆర్టీసీ కార్మికులు అడుగుతున్నా అవి సాధ్యంకావడం లేదంటూ కొట్టిపారేస్తున్నారు. చివరికి హుజూర్ నగర్ ఉపఎన్నికలోనూ టిఆర్ఎస్ గెలించింది. దీంతో కేసీఆర్ అక్కడి నియోజకవర్గ ప్రజలకు వందకోట్ల రూపాయల వరాలు కురిపించారు. ఈ విషయాన్ని సైతం హైకోర్టు ప్రశ్నించింది. ఆర్టీసీకి 47కోట్లు చెల్లించలేని ప్రభుత్వం హుజూర్ నగర్ నియోజకవర్గానికి వందకోట్లు ఎలా ప్రకటించిందని కూడా ధర్మాసనం సెటైర్ వేసింది. కార్మికుల సెప్టెంబర్ వేతనాలు కూడా ఇప్పటివరకు చెల్లించలేదు. దీనిపై కేసు విచారణ శుక్రవారానికి వాయిదా పడింది.

అదే కారణమా…?

కేసీఆర్ ఆర్టీసీ కార్మికులపట్ల ఇంత వివక్ష చూపడానికి కారణం ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికలేనని తెలుస్తోంది. ఆర్టీసీ కార్మికులు కొంతకాలంగా తమ డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని కోరుతున్నా సర్కారు స్పందించలేదు. దీంతో మొన్నటి సాధారణ ఎన్నికల్లో ఆర్టీసీ కార్మికులంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశారనే కారణంగానే కేసీఆర్ వారిపై కక్ష్య పూరితంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఎన్నికల కంటే ముందు కేసీఆర్ కు వచ్చిన ఇంటెలిజెన్స్ వర్గాల నివేదిక ఆధారంగానే కేసీఆర్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కేసీఆర్ కు ఓటేసిన వారికి ఒకలా, వేయని వారికి ఒకలా చూస్తున్నారు. ఎన్నికల్లో ఆర్టీసీ కార్మికులంతా కూడా అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమి పనిచేయలేదు. కొందరు ప్రభుత్వానికి మద్దతుగా, ఇంకొందరు వారి స్థానిక నాయకుల మంచితనాన్ని బట్టి ఓట్లు వేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న కేసీఆర్ ఇలా తమపై కక్ష్యపూరితంగా వ్యవహరించడం భావ్యం కాదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

 

 

Tags:    

Similar News