కోటి లంచం కేసులో అనేక ట్విస్టులు
కీసర మాజీ ఎమ్మార్వో నాగరాజు భూదందా కేసులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఏసీబీ అధికారుల విచారణలో తీగలాగితే డొంక కదిలింది ఏకంగా కలెక్టర్ స్థాయి అధికారితో [more]
కీసర మాజీ ఎమ్మార్వో నాగరాజు భూదందా కేసులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఏసీబీ అధికారుల విచారణలో తీగలాగితే డొంక కదిలింది ఏకంగా కలెక్టర్ స్థాయి అధికారితో [more]
కీసర మాజీ ఎమ్మార్వో నాగరాజు భూదందా కేసులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఏసీబీ అధికారుల విచారణలో తీగలాగితే డొంక కదిలింది ఏకంగా కలెక్టర్ స్థాయి అధికారితో పాటు ఆర్డీవో మరో ఎమ్మార్వో పేర్లు వెలుగులోకి రావడం సంచలనం కలిగిస్తోంది. ఈ కేసులో నిందితులు ఇచ్చిన వాంగ్మూలం పై ఉన్నతాధికారులు ప్రమేయం, పాత్ర పై ఎలా ముందుకు వెళ్లాలని ఏసీబీ యోచిస్తుంది. కీసర మాజీ తహశీల్ధార్ నాగరాజు జారీ చేసిన పట్టా పాస్ పుస్తకాలు ను రద్దు చేసి విచారణ చేయాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ అధికారులు ఆదేశాలు ఇచ్చారు. ఇక ఈ కేసులో నిందితుల నలుగురికి బెయిల్ ఇవ్వడానికి ఏసీబీ కోర్టు నిరాకరించడం తో మరోసారి కష్టడీకి తీసుకొని విచారణ చేయాలనీ ఏసీబీ భావిస్తుంది.
చరిత్రలో తొలిసారి….
ఏసీబీ చరిత్రలోనే మొట్ట మొదటిసారిగా కోటి 10 లక్షల లంచం కేసులో ఏసీబీ దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే ఈ కేసులో నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకుని మూడు రోజుల పాటు విచారించిన ఏసీబీ కీలక అంశాలను గుర్తించింది…రాంపల్లి దాయర గ్రామంలోని 614, మరికొన్ని సర్వేనెంబర్స్ లోని 61ఎకరాల 20 గుంటల వివాదాస్పద భూమిని సెటిల్ చేసేందుకు రెవెన్యూ శాఖ లోని అత్యున్నత స్థాయి అధికారుల నుంచి కింది స్థాయి ఉద్యోగి పాత్ర ఉన్నట్లు నిందితుల కస్టడీ విచారణ లో తేలింది.
అందరూ సహకరించడంతోనే…
రాంపల్లి దయా గ్రామంలోని 614 సర్వే నెంబర్ తో పాటు మరి కొన్ని సర్వే నెంబర్లు కు చెందిన 61 ఎకరాల 20 గుంటల వివాదాస్పద భూమిని రెగ్యులరైజేషన్ చేసేందుకు నిందితుల కస్టడీలో స్పష్టం అయ్యింది.ఈ డీల్ మొదటగా ఎలా కుదిరిందో ఏసీబీ కస్టడీ విచారణ లో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఈకేసులో A-3 శ్రీనాథ్ తెలిపారు. వరంగల్ హనుమకొండ కు చెందిన ఎమ్మార్వో కిరణ్ ప్రకాష్ ద్వారానే మేడ్చల్ ఆర్డిఓ రవి తో ఒప్పందం చేసుకున్నట్లు శ్రీనాథ్ వివరణ ఇచ్చాడు ఆర్డీవో రవి,కిరణ్ ప్రకాష్ లు కలిసి ఎమ్మార్వో నాగరాజు ఒప్పించారు. కలెక్టర్ తో ఎలాగైనా మ్యూటేషన్ చేయిస్తానని హామీ ఇచ్చారు. ఆ తర్వాత జరిగిన ఒప్పందంలో భాగంగానే వరంగల్ జిల్లా నుంచి కోటి రూపాయలు హైదరాబాద్ లో మరో 10 లక్షలు మొత్తం కోటి 10 లక్షలు తీసుకుని అంజిరెడ్డి గెస్ట్ హౌస్ కు చేరుకున్నానని ఆయన చెప్పారు. అక్కడే ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారని ఏ3 శ్రీనాథ్ వెల్లడించారు.
కావాలనే ఇలా చేశారా?
నిందితులు కావాలనే ఉన్నతాధికారులను ఇరికించడానికి ఏసీబీ కి వాంగ్మూలం ఇచ్చారా ? లేదా నిజంగా పై స్థాయి అధికారులు చెప్పినట్లుగానే తహశీల్ధార్ వ్యవహరించాడా అనేది తేలాల్సి ఉంది .. నిందితులు చెప్పిన వాంగూల్మం లో ఎంత వాస్తవం ఉందనేది ఏసీబీ అధికారులు పూర్తి స్థాయి లో ఆరా తీస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కేసు సంచలనం సృష్టించడం తో మేడ్చల్ జిల్లా కీసర రెవెన్యూ పరిధిలోని పట్టా పాస్ పుస్తకాలు పై విచారణకు ఆదేశించారు జిల్లా కలెక్టర్. ఎమ్మార్వో నాగరాజు జారీచేసిన పట్టా పాస్ పుస్తకాలను రద్దుచేసి, వాటిపైన విచారణ జరపాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కీసర తహశీల్ధార్ గా నాగరాజు బాధ్యతలు స్వీకరించిన తరువాత ఎన్ని పట్టా పాస్ పుస్తకాలు జారీ చేశాడు అనే దానిపై అధికారులు రికార్డు లు పరిశీలిస్తున్నారు. విచారణ పూర్తి అయిన తరువాత జిల్లా కలెక్టర్ కు నివేదిక అందజేయనున్నారు అధికారులు.