khairathabad ganesh : గణేష్ ఉత్సవ కమిటీ కీలక నిర్ణయం
ఖైరతాబాద్ గణేష్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి మండపంలోనే నిమజ్జనం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఖైరతాబాద్ గణేషుడిని ప్రతి ఏడాది హుస్సేన్ సాగర్ [more]
;
ఖైరతాబాద్ గణేష్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి మండపంలోనే నిమజ్జనం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఖైరతాబాద్ గణేషుడిని ప్రతి ఏడాది హుస్సేన్ సాగర్ [more]
ఖైరతాబాద్ గణేష్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి మండపంలోనే నిమజ్జనం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఖైరతాబాద్ గణేషుడిని ప్రతి ఏడాది హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేస్తారు. అయితే పర్యావరణం, ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారు. కోర్టులు కూడా హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం పట్ల అభ్యంతరం తెలుపుతోంది. ఈ ఏడాది కూడా పీవోపీ విగ్రహాలు తప్పించి మిగిలినవి హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయవచ్చని తెలిపింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కానీ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సమావేశమై వచ్చే ఏడాది నుంచి మండపంలోనే నిమజ్జనం చేయాలని నిర్ణయం తీసుకుంది.