అక్రమాలు చేసినందుకే ధూళిపాళ్ల అరెస్ట్

సంగం డెయిరీలో అక్రమాలకు పాల్పడినందుకే ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ అరెస్ట్ చేసినట్లు పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోశయ్య తెలిపారు. రైతుల ప్రయోజనాలకు నరేంద్ర గండికొట్టారన్నారు. వందల కోట్ల [more]

;

Update: 2021-04-24 00:39 GMT

సంగం డెయిరీలో అక్రమాలకు పాల్పడినందుకే ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ అరెస్ట్ చేసినట్లు పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోశయ్య తెలిపారు. రైతుల ప్రయోజనాలకు నరేంద్ర గండికొట్టారన్నారు. వందల కోట్ల రూపాయలను ధూళిపాళ్ల నరేంద్ర కూడబెట్టారని కిలారు రోశయ్య ఆరోపించారు. రైతులకు లీటరుకు 1.50 మాత్రమే ఇచ్చి, తాను డెయిరీ నుంచి ఎన్నికల చందాను కూడా వసూలు చేసుకున్నారని కిలారు రోశయ్య ఆరోపించారు. చంద్రబాబు హెరిటేజ్ కోసం చిత్తూరు డెయిరీని మూసివేయలేదా? అని కిలారు రోశయ్య ప్రశ్నించారు. రైతుల ప్రయోజనాల కోసమే నరేంద్రను ఏసీబీ అరెస్ట్ చేసిందని ఆయన తెలిపారు.

Tags:    

Similar News