కోమటిరెడ్డి వెంకటరెడ్డి కఠిన నిర్ణయాన్ని ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దిగొచ్చింది. నకిరేకల్ సీటు చిరుమర్తి లింగయ్య కు టిక్కెట్ ఇవ్వకుంటే తాను కూడా నల్గొండలో పోటీ చేయనని ఆయన ప్రకటించారు. నకరేకల్ సీటును తెలంగాణ ఇంటిపార్టీకి కేటాయించనున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో కోమటిరెడ్డి పై విధంగా స్పందించారు. కోమటిరెడ్డి ప్రకటన ఢిల్లీకి తాకింది. దీంతో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి కుంతియా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఫోన్ చేశారు. తెలంగాణ ఇంటిపార్టీకి ఎక్కడ సీటు ఇచ్చేదీ ఇంకా తేల్చలేదని, నకిరేకల్ సీటు చిరుమర్తి లింగయ్యకే కేటాయిస్తామని కుంతియా హామీ ఇచ్చినట్లు తెలిసింది. మొత్తం మీద కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటనతో కాంగ్రెస్ అధిష్టానం దిగొచ్చింది.