1 April-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం ముగిసింది. ఏపీలో 58 అసెంబ్లీ స్థానాలు ఎనిమిది లోక్్సభ స్థానాలకు మినహా అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. కడప పార్లమెంటు నియోజకవర్గం నుంచి వైఎస్ షర్మిల పోటీ చేయాలని కాంగ్రెస్ ఎన్నికల కమిటీ నిర్ణయించింది.

Update: 2024-04-01 12:33 GMT

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

Breaking : కడప నుంచి వైఎస్ షర్మిల పోటీ

కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం ముగిసింది. ఏపీలో 58 అసెంబ్లీ స్థానాలు ఎనిమిది లోక్్సభ స్థానాలకు మినహా అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. కడప పార్లమెంటు నియోజకవర్గం నుంచి వైఎస్ షర్మిల పోటీ చేయాలని కాంగ్రెస్ ఎన్నికల కమిటీ నిర్ణయించింది.

Janasena : జనసేనలో చేరిన మండలి బుద్ధప్రసాద్ 

అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ జనసేన పార్టీలో చేరారు. ఆయన కొద్దిసేపటి క్రితం పిఠాపురంలో పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీలో చేరిపోయారు. ఆయనకు అవనిగడ్డ జనసేన టిక్కెట్ ఇచ్చే అవకాశముంది. దీంతో అవనిగడ్డలోని జనసేన పార్టీ కార్యకర్తలు పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు.

జ్యుడిషియల్ కస్టడీకీ అరవింద్ కేజ్రీవాల్.. తీహార్ జైలుకు

అరవింద్ కేజ్రీవాల్ ను జ్యుడిషియల్ కస్టడీకి ఆదేశిస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశించింది. దీంతో ఆయన తీహార్ జైలుకు తరలించనున్నారు. ఏప్రిల్ 15వ తేదీ వరకూ అరవింద్ కేజ్రీవాల్ కు జ్యుడిషియల్ కస్టడీని విధించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కస్టడీ నేటితో ముగిసింది.

IPL 2024 : నేడు ముంబయికి మరో సవాల్

ముంబయి ఇండియన్స్ నేడు ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం ఆ జట్టు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముంబయిలో జరిగే ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని ముంబయి ఇండియన్స్ కసితో ఉంది. ఇప్పటికే వరస ఓటములతో జట్టు ఒకింత కుంగిపోయి ఉంది.

ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ వాయిదా

మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ వాయిదా పడింది. రేపు జరగాల్సిన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ వాయిదా వేయాలంటూ జిల్లా కలెక్టర్ కు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో కౌంటింగ్ చేయవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది.

జగన్ కు సుప్రీంకోర్టులో భారీ ఊరట

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయన బెయిల్ ను రద్దు చేయాలంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటీషన్ పై విచారణ జరిగింది. దీంతో పాటు జగన్ పై నమోదయిన కేసులను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయాలంటూ మరొక పిటీషన్ కూడా దాఖలయింది.

Congress : కేసీఆర్ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు

కేసీఆర్ అన్నీ అబద్ధాలు చెప్పి వెళ్లాడని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ వల్లనే కరువు వచ్చిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వారి హయాంలోనే బీటలు వారిందన్నారు. కమీషన్ల కక్కుర్తితో కేసీఆర్ ప్రాజెక్టుల డిజైన్లు మార్చి నిర్మించడం వల్లనే ఈ దుస్థితి తలెత్తిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

గుడ్ న్యూస్... సిలిండర్ ధరలు దిగి వచ్చాయ్

గ్యాస్ సిలిండర్ల ధరలు తగ్గిస్తూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ప్రతి నెల ఒకటోతేదీన గ్యాస్, పెట్రోల్ పై సమీక్షించి ధరలపై చమురు సంస్థలు నిర్ణయం తీసుకుంటాయి. ఇందులో భాగంగా ఈరోజు ఏప్రిల్ ఒకటోతేదీ కావడంతో గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. అయితే 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధరలపైనే తగ్గించింది. దీనిపై 30.50 రూపాయలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఐదుకేజీల ఎఫ్.టీ.ఎల్ గ్యాస్ సిలిండర్ ధరపై 7.50 రూపాయలు తగ్గించింది.

పంత్ పంతం నెగ్గించుకున్నాడు మరి...మరీ టీంను గెలిపించుకున్నాడుగా

ఐపీఎల్ లో నిన్న విశాఖలో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ కాపిటల్స్ మధ్య జరిగిన మధ్య మ్యాచ్ లో చివరకు ఢిల్లీదే విజయం అయింది. ఐపీఎల్ లో తొలి పరాజయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ చూసింది. అదే సమయంలో తొలి సీజన్ లో ఢిల్లీ కాపిటల్స్ తొలి విజయాన్ని చవి చూసింది. అదీ ఐపీఎల్ లోనే సత్తా ఉన్న జట్టుపై గెలిచి తాను కూడా రేసులో ఉన్నానని నిరూపించుకుకుంది.

కవిత బెయిల్ కేసు వాయిదా

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటీషన్ విచారణ జరిగింది. తదుపరి విచారణను ఈ నెల 4వ తేదీకి వాయిదా వేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయి జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న కవిత తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. నేడు బెయిల్ పిటీషన్ పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది.



Tags:    

Similar News