Andhra Pradesh : ఏపీ నూతన చీఫ్ సెక్రటరీగా విజయానంద్
ఆంధ్రప్రదేశ్ నూతన చీఫ్ సెక్రటరీగా కె. విజయానంద్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది
ఆంధ్రప్రదేశ్ నూతన చీఫ్ సెక్రటరీగా కె. విజయానంద్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. 1992 బ్యాచ్ కు చెందిన విజయానంద్ గతంలో వివిధ శాఖల్లో పనిచేశారు. ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ప్రస్తుత చీఫ్ నీరబ్ కుమార్ ప్రసాద్ రేపు పదవీ విరమణ చేయనుండటంతో ఆయన స్థానంలో విజయానంద్ నియమితులయ్యారు. ఏపీ జెన్ కో, ట్రాన్స్ కో ఎండీలుగా కూడా విజయానంద్ పనిచేశారు. విజయానంద్ స్వస్థలం కడప జిల్లా కావడం విశేషం. ఆయన ఐఏఎస్ అధికారిగా తొలి పోస్టింగ్ ను ఆదిలాబాద్ జిల్లా సబ్ కలెక్టర్ గా పనిచేశారు.
వచ్చేఏడాది నవంబరులో...
తర్వాత రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ గా పనిచేశారు. శ్రీకాకుళం, నల్గొండ కలెక్టర్ గా కూడా విజయానంద్ పనిచేశారు. బీసీ వర్గానికి చెందిన విజయానంద్ వచ్చే ఏడాది నవంబరులో పదవీ విరమణ చేయనున్నారు. సీనియారిటీ ప్రకారం చూస్తూ విజయానంద్ కంటే సీనియర్ అధికారి సాయి ప్రసాద్ ఉన్నారు. సాయి ప్రసాద్ 1991 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి. అయితే ఆయనను సీనియారిటీ ప్రాతిపదికన చీఫ్ సెక్రటరీగా నియమిస్తే విజయానంద్ కు అవకాశం దక్కదని భావించి చంద్రబాబు విజయానంద్ వైపు మొగ్గు చూపారు.