March 11-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
సుప్రీంకోర్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎలక్ట్రోరల్ బాండ్స్ వివరాలను వెల్లడించేందుకు మరింత సమయం తాము ఇవ్వలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసుకున్న విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. రేపటి లోగా విరాళాల వివరాలను వెల్లడించాలని పేర్కొంది.
(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
Supreme Court : ఎస్‌బీఐకి షాకిచ్చిన సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎలక్ట్రోరల్ బాండ్స్ వివరాలను వెల్లడించేందుకు మరింత సమయం తాము ఇవ్వలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసుకున్న విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. రేపటి లోగా విరాళాల వివరాలను వెల్లడించాలని పేర్కొంది.
సత్యం సినిమా దర్శకుడు సూర్య కిరణ్ కన్నుమూత.. కారణమిదే!!
సత్యం సినిమా దర్శకుడు సూర్య కిరణ్ కన్నుమూశారు. నటి కళ్యాణికి మాజీ భర్త అయిన సూర్య కిరణ్ బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్ లో కనిపించి తెలుగు వాళ్లకు బాగా దగ్గర అయ్యారు. అనారోగ్య కారణాలతో ఆయన సోమవారం తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల కోలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం నాడు ఆయన అంత్య క్రియలు జరుగనున్నాయి.
Telangana : ధరణిపై టీ సర్కార్ కీలక నిర్ణయం
ధరణి పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం చేసింది. ధరణి దరఖాస్తుల పరిశీలనకు గడువు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 17వ తేదీ వరకూ గడువు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ధరణిలో సమస్యలు ఏవైనా ఉంటే వారు ఈ నెల 17వ తేదీ వరకూ దరఖాస్తులు పరిశీలన చేసే వీలుంది.
Breaking : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. గెజిట్ విడుదల
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి పౌరస్మృతి సవరణ చట్టంపై కేంద్ర ప్రభుత్వం నుంచి గెజిట్ విడుదలయింది. నేటి నుంచి ఉమ్మడి పౌరస్మృతి పౌరసత్వం చట్టం అమలులోకి రాబోతుందని కేంద్ర హోంశాఖ గెజిట్ ను విడుదల చేసింది. నాలుగేళ్ల తర్వాత నేడు ఇది కార్యరూపం దాల్చింది.
దివ్యాస్త్ర ఫస్ట్ టెస్ట్ సక్సెస్.. మోదీ అభినందనలు
డీఆర్‌డీవో మిషన్ దివ్యాస్త్ర ఫస్ట్ టెస్ట్ విజయవంతం అయింది. మిషన్ దివ్యాస్త్రలో భాగంగా అగ్ని-5 డీఆర్డీవో రూపకల్పన చేసింది. అగ్ని-5 తొలి పరీక్ష విజయవంతమయింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. డీఆర్‌డీవో శాస్త్రవేత్తలను మోదీ అభినందించారు. ఈ విజయం ఢిఫెన్స్ సామర్థ్యం మరింత పెరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు.
Oscars 2024 : మొదటి ఆస్కార్స్‌ని గెలుచుకున్న ఐరన్ మ్యాన్, నోలన్..
96వ ఆస్కార్ వేడుకలు నేడు లాస్ ఏంజిల్స్ లో ఘనంగా జరిగాయి. ఇక వేడుకల్లో 'క్రిస్టోఫర్ నోలన్' తెరకెక్కించిన 'ఓపెన్ హైమర్' చిత్రం ఏకంగా 7 అవార్డులను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో ఐరన్ మ్యాన్ ఫేమ్ 'రాబర్ట్ డౌనీ జూనియర్' సపోర్టింగ్ రోల్ చేయగా, 'కిలియన్ మర్ఫీ' మెయిన్ లీడ్ చేసారు. క్రిస్టోఫర్ నోలన్‌కి బెస్ట్ డైరెక్టర్‌గా, రాబర్ట్ డౌనీ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌గా, కిలియన్ మర్ఫీ బెస్ట్ యాక్టర్‌గా ఆస్కార్ అవార్డులను అందుకున్నారు.
RRR : ఆస్కార్ వేదికపై మరోసారి ఆర్ఆర్ఆర్.. బెస్ట్ స్టంట్ సీన్..
లాస్ ఏంజిల్స్ లో 96వ ఆస్కార్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక ఈ 96వ ఎడిషన్ లో 'క్రిస్టోఫర్ నోలన్' తెరకెక్కించిన 'ఓపెన్ హైమర్' చిత్రం ఏడు ఆస్కార్ లను సొంతం చేసుకొని అదుర్స్ అనిపించింది. అలాగే 'పూర్ థింగ్స్' చిత్రం నాలుగు ఆస్కార్ ని గెలుచుకొని నెక్స్ట్ ప్లేస్ లో నిలిచింది.
Ys Jagan : రాజకీయాల్లో అంకెలు ఎంత ముఖ్యమో... లెక్కలు కూడా అంతే అవసరమే
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అంతు చిక్కని మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా అధికారంలో ఉన్న జగన్ తన పాలనకు తిరుగులేదని నమ్ముతున్నారు. సంక్షేమ పథకాలు తనను గట్టెక్కిస్తాయని గట్టిగానే విశ్వసిస్తున్నారు. ఇంతగా పేదలను ఆదుకున్న ప్రభుత్వం మరేదీ లేదని, అందుకే తాను ఎవరిని ఎన్నికల్లో బరిలోకి దింపినా తనను చూసి ఓటేస్తారని ఆయన భావిస్తున్నారు.
Ramadan : నేటి నుంచి రంజాన్ మాసం ప్రారంభం
నేటి నుంచి పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమయింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు చేశాయి. దేశ వ్యాప్తంగా రేపు ఉదయం నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్న తరుణంలో అన్ని మసీదుల వద్ద ప్రార్థనల కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేశారు.
Lemon : ఈ నిమ్మకాయ ఖరీదు 35 వేలు.. దీని స్పెషాలిటీ ఏంటంటే?
నిమ్మకాయ.. వేసవి కాలంలో శరీరాన్ని చల్లబర్చేందుకు వినియోగిస్తారు. నిమ్మకాయ మజ్జిగ తాగినా, కనీసం నిమ్మకాయ సోడా తాగినా సరే శరీరంలో వేడి తగ్గుతుంది. అందుకే వేసవికాలంలో నిమ్మకాయకు అంత డిమాండ్. మార్కెట్ లో సమ్మర్ లో ఎక్కువగా అమ్ముడుపోయేది కూడా ఈ నిమ్మకాయలే.