March 12-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

రెండు తెలుగు రాష్ట్రాలను కలిపే మరో వందే భారత్ రైలు నేడు ప్రారంభం కానుంది. మరొక వందేభారత్ రైలు తెలుగు రాష్ట్రాలలో పరుగులు తీయనుంది. దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఈ మేరకు ప్రకటించారు. విశాఖ నుంచి హైదరాబాద్‌కు మరో వందేభారత్ రైలు నేటి నుంచి ప్రజలకు అందుబాటులోకి రానుంది.

Update: 2024-03-12 12:42 GMT

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

Vande Bharat Train : తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్.. నేటి నుంచే ప్రారంభం

రెండు తెలుగు రాష్ట్రాలను కలిపే మరో వందే భారత్ రైలు నేడు ప్రారంభం కానుంది. మరొక వందేభారత్ రైలు తెలుగు రాష్ట్రాలలో పరుగులు తీయనుంది. దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఈ మేరకు ప్రకటించారు. విశాఖ నుంచి హైదరాబాద్‌కు మరో వందేభారత్ రైలు నేటి నుంచి ప్రజలకు అందుబాటులోకి రానుంది.

IPL 2024 : రెడీ అయిపోండి.. మజా చేసేయండి.. ప్రతి రోజూ పండగే ఇక

ఐపీఎల్ సీజన్ పది రోజుల్లో ప్రారంభం కానుంది. ఐపీఎల్ 17వ సీజన్ ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. ఐపీఎల్ సీజన్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ కళ్లలో వత్తులేసుకుని మరీ ఎదురు చూస్తుంటారు. క్రికెట్ లో అసలైన మజాను ఆస్వాదించడానికి ఇందులోనే సాధ్యం. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా ఒక్కటేమిటి అన్ని రంగాల్లో రికార్డు మోత మోగుతాయి.

మామను చితకబాదిన కోడలు.. 87 ఏళ్ల వృద్ధుడిని కొడుతూ తిడుతూ...?

ఒక కోడలు వృద్ధుడైన తన మామను ఊతకర్రతో చితకబాదిన ఘటన కలచి వేసింది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది. అయితే ఈ కోడలు మామను చితకబాదుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో చిక్కడంతో పోలీసులు కేసు నమోదు చేసి ఆమెను అరెస్ట్ చేశారు. కర్ణాటకలోని మంగళూరులో ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన మానవత్వానికే కళంకం తెచ్చే విధంగా ఉంది.

Byjus: బైజూస్‌ కార్యాలయాలు మూసివేత.. కారణం ఏంటో తెలుసా?

ఒకప్పుడు ప్రపంచంలోనే మోస్ట్ వాల్యూడ్ ఎడ్‌టెక్ కంపెనీగా ఉన్న బైజూస్‌ ఇప్పుడు ఆర్థిక ఊబిలో కూరుకుపోయి కొట్టుమిట్టాడుతోంది. ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కష్టాల్లో చిక్కుకున్న బైజూస్‌ కంపెనీ ఉద్యోగుల జీతాలు సైతం చెల్లించలేని పరిస్థితిలో ఉన్నట్లు సమాచారం.

Yellow Fruits: పసుపు పండ్లు శరీరానికి ఎంత మేలు చేస్తాయో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!

పసుపు మన కళ్లకు అత్యంత ఆహ్లాదకరమైన రంగు. ఇది తరచుగా సూర్యరశ్మి, ఆనందం రంగుగా పరిగణించబడుతుంది. పసుపు పండ్లు, కూరగాయలు తినడం వల్ల మన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది మనకు మెరిసేచర్మాన్ని అందిస్తుంది. పసుపు ఆహారాలలో కెరోటినాయిడ్స్, బయోఫ్లేవనాయిడ్స్ ఉంటాయి.

ప్లీజ్ ఛాన్సులివ్వండి అంటూ అవినాష్.. చాలారోజులకు కనిపించిన ప్రదీప్..

తెలుగు టీవీ షోలతో పలువురు యాక్టర్స్ ఎంతో ఫేమ్ ని సంపాదించుకున్నారు. అలా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఎంతో గుర్తింపుని సంపాదించుకున్న నటుల్లో ముక్కు అవినాష్, యాంకర్ ప్రదీప్ కూడా ఉన్నారు. జబర్దస్త్ షోతో ముక్కు అవినాష్ అలరిస్తే, ఢీ మరియు పలు ఎంటర్టైన్మెంట్ షోలతో యాంకర్ ప్రదీప్ అలరిస్తూ వచ్చారు. బుల్లితెర పై ఆకట్టుకున్న ఈ ఇద్దరు సినిమాల్లో కూడా నటించి మెప్పించారు.

మిషన్ భగీరధ ఏఈ..15 కోట్లు కొట్టేసి.. దుబాయ్ పారిపోతుండగా?

మిషన్ భగీరధలో అసిస్టెంట్ ఇంజినీర్ అతను. భార్య కూడా మంచి ఉద్యోగం. తల్లిదండ్రులు కూడా ప్రభుత్వోద్యోగులే. అయితే డబ్బు ఆశ ఆ యువకుడిని అప్పుల పాలు చేసింది. బెట్టింగ్‌ ల కోసం అందిన కాడికి అప్పులు చేశాడు. ఆ అప్పులు తీర్చడానికి కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు వసూలు చేశాడు. ఒకటి కాదు.. రెండు కాదు..

Telangana : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలివే

తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో పదహారు బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని ఆమోదించింది. బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ సచివాలయంలో జరిగిన సమావేశంలో గంట సేపు పలు అంశాలపై మంత్రివర్గ సమావేశం చర్చించింది. రెండున్నర గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో అనేక నిర్ణయాలను తీసుకుంది.

Healthy Food: మీకు ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఈ 3 ఆహారపు అలవాట్లు!

ఆరోగ్యంగా ఉండాలంటే సమయానికి ఆహారం తీసుకోవడం చాలా అవసరం. మీరు సరిగ్గా తినకపోతే, శరీరానికి అవసరమైన పోషకాలు అందవు. ఇది వ్యాధులు అభివృద్ధి చెందే ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే జీవనశైలి, ఆహారపు అలవాట్లు వంటి వాటిని సరిగ్గా పాటించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Ramadan : నేటి నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం

పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం అయింది. నేటి నుంచి ముస్లిం సోదరులు ఉపవాస దీక్షలు ప్రారంభం అయ్యాయి. ముస్లింలు పవిత్ర మాసంగా భావించే రంజాన్ నెల ప్రారంభం కావడంతో హైదరాబాద్‌లో పాతబస్తీ అనేక సొబగులు అద్దుకుంది. ముప్పయి రోజుల పాటు నియమ నిష్టలతో ముస్లిం సోదరులు రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చేేస్తారు. ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ ఉపవాసం చేస్తారు. తర్వాత ఇఫ్తార్ తో ముగించనున్నారు.


Tags:    

Similar News