18July-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
ఈనెల 27వ తేదీ నుంచి టీం ఇండియా శ్రీలంక పర్యటన ఖరారయింది. ఇందులో భాగంగా ఈ నెల 27వ తేదీ నుంచి టీ20 సిరీస్, ఆగస్ట్ 2 నుంచి వన్డే సిరీస్ ప్రారంభంకానున్నాయి. శ్రీలంక పర్యటనకు భారత జట్లను బీసీసీఐ ఇవాళ ప్రకటించే అవకాశముందని తెలిసింది. బుధవారమే జట్లను ఎంపిక చేయాల్సి ఉండగా.. సెలక్షన్ కమిటీ సమావేశం నేటికి వాయిదా పడింది.
(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
శ్రీలంక టూర్...నేడే భారత జట్టు ప్రకటన
ఈనెల 27వ తేదీ నుంచి టీం ఇండియా శ్రీలంక పర్యటన ఖరారయింది. ఇందులో భాగంగా ఈ నెల 27వ తేదీ నుంచి టీ20 సిరీస్, ఆగస్ట్ 2 నుంచి వన్డే సిరీస్ ప్రారంభంకానున్నాయి. శ్రీలంక పర్యటనకు భారత జట్లను బీసీసీఐ ఇవాళ ప్రకటించే అవకాశముందని తెలిసింది. బుధవారమే జట్లను ఎంపిక చేయాల్సి ఉండగా.. సెలక్షన్ కమిటీ సమావేశం నేటికి వాయిదా పడింది.
Chandrababu : అసలు విషయం తేలేది అప్పుడేనట.. అప్పుటి వరకూ వెయిట్ చేయాల్సిందే
మరో ఐదు రోజులు మాత్రమే గడువు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అసలు సిసలు పరీక్ష. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు కేంద్రంలో బీజేపీకి వచ్చిన మెజారిటీ సంఖ్యను చూసి చాలా ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్రాన్ని గాడిన పెట్టాలంటే కేంద్రం నుంచి సహాయ సహకారాలు అవసరం.
Puri Jagannadh Temple : నేడు తెరుచుకోనున్న రహస్య గది తలుపులు
పూరీలో నేడు రహస్య గది తలుపులు తెరుచుకోనున్నాయి. మూడో గదిలో ఉన్న పెట్టెల్లో ఏముందన్నది నేడు తెలియనుంది. పూరీ జగన్నాధునికి సంబంధించి అనేక బంగారు, వెండి, వజ్రాభరణాలున్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు. అవన్నీ భద్రంగా ఉన్నాయా? లేదా. అన్నది నేడు తేలనుంది.
భారీ ఎన్‌కౌంటర్.. 12 మంది మావోల మృతి
మహారాష్ట్రలోని గడ్చిరోలిలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులకు మావోయిస్టులకు మధ్య నిన్న ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురు కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత లక్ష్మణ్ ఆత్రంతో సహా 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది.
పట్టాలు తప్పిన ఎక్స్‌ప్రెస్ రైలు.. నలుగురి మృతి
ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో నలుగురు ప్రయాణికులు మరణించారు. ఇరవై మందికి పైగానే గాయపడ్డారు. ఉత్తర్‌ప్రదేశ్ లోని గోండా జిల్లాలో చండీగఢ్ - డిబ్రూగడ్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. చండీగఢ్ నుంచి అసోంలోని డిబ్రూగడ్ కు బయలుదేరిన ఈ రైలు ఝులాహి రైల్వేస్టేషన్ కు కొన్ని కిలోమీటర్ల దూరంలో ప్రమాదానికి గురయింది.
Karnataka : గ్యారంటీలు అమలు చేయలేక.. ఆపసోపాలు... అభివృద్ధి ఎక్కడ బాబాయ్?
ఇచ్చిన హామీలు అమలు చేయడం అంత సులువు కాదు. రాష్ట్ర ఖజానా అందుకు సరిపోదు. కర్ణాటకలో ఐదు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడానికి ఆపసోపాలు పడుతుంది. మరో వైపు ఎప్పటికప్పుడు వివిధ వర్గాల నుంచి వస్తున్న డిమాండ్లను నెరవేర్చాలి.
Telangana : నేడు రైతులకు గుడ్ న్యూస్ వారి ఖాతాల్లో లక్ష రూపాయలు
తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి రైతు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు లక్ష రూపాయల వరకూ ఉన్న రుణాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. లక్ష రూపాయల రుణమాఫీని 11.42 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందుతున్నారు.
Janasena : నేటి నుంచి జనసేన సభ్యత్వం ప్రారంభం
నేటి నుంచి జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కానుంది. అన్ని నియోజకవర్గాల్లో సభ్యత నమోదును ప్రారంభించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని పదిరోజులపాటు సభ్యత్వ నమోదు నిర్వహించాలని కేంద్ర పార్టీ నాయకత్వం ఆదేశాలు జారీ చేసింది.
పుంగనూరులో టెన్షన్.. టీడీపీ కార్యకర్తల రాళ్లదాడి
పుంగనూరులో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. రాజంపేట పార్లమెంటు సభ్యుడు మిధున్ రెడ్డి పర్యటనను టీడీపీ కార్యకర్తలు అడ్డుకునేందుకు వచ్చారు. చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి మిధున్ రెడ్డి వచ్చారు. అయితే మిధున్ రెడ్డి రెడ్డప్ప ఇంటికి వచ్చారని తెలిసి పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్న టీడీపీ కార్యకర్తలు ఆ ఇంటిపై రాళ్లు రువ్వారు.
Chandrababu : నేడు లా అండ్ ఆర్డర్ పై వైట్ పేపర్
గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను, అక్రమాలను బయటపెడుతూ వరసగా ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలను విడుదల చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు శాంతిభద్రతల అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. గురువారం మధ్యాహ్నం 3గంటలకు రాష్ట్ర సచివాలయంలో శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.