టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

Update: 2024-01-19 12:30 GMT

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

పోలీసుల అదుపులో ముగ్గురు ఆగంతకులు

రామ మందిర పున: ప్రతిష్ట వేళ అయోధ్యలో ముగ్గురు ఆగంతుకులు పోలీసులకు చిక్కారు. యాంటీ టెర్రిరిస్టు స్క్వాడ్‌ గురువారం సాయంత్రం (ఏటీఎస్‌) అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుంది, ఉత్తరప్రదేశ్‌ డీజీపీ (లా అండ్‌ ఆర్డర్‌) ప్రశాంత్‌ కుమార్‌ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు.

Ambedkar : నేడు బెజవాడలో దేశంలో అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ

విజయవాడ ఈరోజు మహత్తర ఘట్టానికి వేదిక కానుంది. దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆవిష్కరించనున్నారు. విజయవాడలోని స్వరాజ్ మైదానంలోని 18.18 ఎకరాల్లో ఈ అంబేద్కర్ విగ్రహాన్ని, స్మృతి వనాన్ని ఏర్పాటు చేశారు. విజయవాడకు మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ కు ఇది అతిపెద్ద టూరిజం ప్రాజెక్టుగా మారే అవకాశముంది.


YSRCP : నాలుగోది కూడా వచ్చేసింది డ్యూడ్.. మరెన్ని లిస్టులుంటాయో?

వైసీపీ నాలుగో జాబితా విడుదలయింది. మొత్తం 9 నియోజకవర్గాల్లో మార్పులు చేపట్టారు. ఒక పార్లమెంటు, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో మార్పులు చేశారు. ఇప్పటి వరకూ మూడు జాబితాలను ప్రకటించిన పార్టీ హైకమాండ్ 59 నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేపట్టింది.


Andhra Pradesh : నేటి నుంచి ఏపీలో కులగణన

ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి కులగణన ప్రారంభం కానుంది. ప్రతి గ్రామంలో వాలంటీర్లు ఈ కులగణనను నిర్వహించనున్నారు. ఈరోజు నుంచి పది రోజుల పాటు కులగణన జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది.

Kesineni Nani : కేశినేని ఫస్ట్ విక్టరీ కొట్టేశారుగా.. అనుకున్నది సాధించినట్లేనా?

విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని వైసీపీలో తొలి విజయం సాధించారు. తనకు పార్లమెంటు నియోజకవర్గం టిక్కెట్ ఖరారు చేసుకోవడంతో పాటు ఆయన ప్రధాన అనుచరుడు, సన్నిహితుడు తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసుకు కూడా సీటును ఇప్పించుకున్నారు.


Ys Sharmila : ముగ్గురు పీసీసీ చీఫ్ లు మారారు... షర్మిలను మార్చరన్న గ్యారంటీ ఉందా?

రక్తసంబంధం అనేది ఎవరూ కాదనలేనిది. ఒక ఇంట పుట్టిన వారికి ఆప్యాయతలు.. అనురాగాలు మనసులోనే ఉంటాయి. కొందరు బాహాటంగా బయటపెడతారు. మరికొందరు అవసరమైనప్పుడు తోబుట్టువుకు అండగా నిలబడేందుకు ప్రయత్నిస్తారు.


Delhi : ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనమయ్యారు. ఢిల్లీలోని పీతంపుర ప్రాంతంలోని ఒక బిల్డింగ్ లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరొకరికి గాయాలయ్యాయి. మరణించిన ఆరుగురు రెండుకుటుంబాలకు చెందిన వారిగా గుర్తించారు.

Modi : కేంద్రం గుడ్ న్యూస్... ఇక వారి కోరిక నెరవేరినట్లేనా?

ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ వర్గీకరణ కోసం కమిటీని ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర కేబినెట్ కారయదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలో ఈ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

Prabhas : అయోధ్య రామ భక్తుల కోసం ప్రభాస్ 50 కోట్ల విరాళం..

మన డార్లింగ్ ప్రభాస్ మనసు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన మంచితనంతో అందరి మనసుని గెలుచుకొని డార్లింగ్ అనే ట్యాగ్ ని తన ఇంటి పేరుని చేసుకున్నారు. ఇక తాజాగా అయోధ్య రామ మందిరం విషయంలో ప్రభాస్ మరోసారి తన గొప్ప మనసుని చాటుకున్నారు.

బంగారం వినియోగంలో మనమెక్కడ?

బంగారం ఉత్పత్తిలో ప్రధమ స్థానంలో ఉన్న దేశం మీకు తెలుసా? బంగారం వినియోగంలో మన దేశం ఎన్నో స్థానంలో ఉందో తెలుసా? స్వర్ణం మనకు అత్యంత ప్రియమైన లోహం. పండుగలు, వేడుకలు, శుభకార్యాల్లో బంగారం కళకళలు కనిపిస్తూ ఉంటాయి.


Tags:    

Similar News