March19-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

ఛత్తీస్‌గడ్ సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్ లో నలుగురు మావోయిస్టు అగ్రనేతలు చనిపోయినట్లు సమాచారం. డీవీసీ సభ్యుడు వర్గీష్, డీవీసీ మంాతు, డీవీసీ సభ్యులు కురుసాం రాజు, వెంకటేష్ లు మరణించినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారికంగా సమాచారం రాకపోయినప్పటికీ పోలీసులు అనధికారికంగా ధృవీకరించారు.

Update: 2024-03-19 12:30 GMT

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

Security forces killed Top Maoists Leaders : భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మావో అగ్రనేతల మృతి

ఛత్తీస్‌గడ్ సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్ లో నలుగురు మావోయిస్టు అగ్రనేతలు చనిపోయినట్లు సమాచారం. డీవీసీ సభ్యుడు వర్గీష్, డీవీసీ మంాతు, డీవీసీ సభ్యులు కురుసాం రాజు, వెంకటేష్ లు మరణించినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారికంగా సమాచారం రాకపోయినప్పటికీ పోలీసులు అనధికారికంగా ధృవీకరించారు.

Amaravathi Real Estate : నిన్నటి వరకూ కొనేవారు లేరు.. నేడు అడుగుతున్నారట.. అమరావతిలో భూములకు మళ్లీ రెక్కలు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో గత ఐదేళ్ల నుంచి భూముల ధరలు నేల చూపులు చూస్తున్నాయి. మూడు రాజధానుల అంశాన్ని ప్రభుత్వం తెరపైకి తేవడంతో రాజధాని అమరావతి ప్రాంతంలో భూములు ధరలు దారుణంగా పడిపోయాయి. రియల్ ఎస్టేట్ సంస్థలు దాదాపు మూతపడే స్థితికి చేరుకున్నాయి. కేవలం భూములే కాదు.. అపార్ట్‌మెంట్ల కొనుగోలు కూడా గత నాలుగేళ్లలో తగ్గిందని గణాంకాలు చెబుతున్నాయి.

Ap Politics : ముగ్గురిలో నమ్మకం పర్సంటేజీ ఎంత..? ఇంత అని చెప్పలేనంత

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడింది. వచ్చే ఎన్నికలకు మూడు పార్టీలు కలసి వెళుతున్నాయి. కాని ఒకరిపై ఒకరికి నమ్మకం లేదు. పార్టీ అగ్రనాయకత్వం నుంచి కింది స్థాయి క్యాడర్ వరకూ అనుమానాలు. నిజంగా పొత్తు ఉందా? అన్న సందేహాలు ఆ పార్టీల క్యాడర్ లో కనిపిస్తుండటం ఇప్పుడు నేతల్లో ఆందోళన కలిగిస్తుంది. ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి ఓట్లు బదిలీ అవుతాయా? అన్న అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి.

Weather Alert : తెలంగాణలో ఎల్లో అలెర్ట్.. భారీ వర్షాలు రానున్న రెండురోజుల్లో ఈదురుగాలులు కూడా

ఎండలు మండిపోతున్న సమయంలో వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. మరో మూడు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు పడే అవకాశముంది.ఈ మేరకు వాతావరణ శాఖ తెలిపింది. అనేక జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈదురుగాలులు కూడా వీసే అవకాశముందని తెలిపింది.

YSRCP : ఫ్యాన్ పార్టీకి అసలు గండం అదేనా.. వాళ్లు సహకరించక పోతే ఇక అంతేనా?

రాయలసీమలో వైఎస్ జగన్ కు ఎదురు లేదు. అది మొన్నటి వరకూ వినిపించిన టాక్. కానీ రాను రాను పరిస్థితుల్లో మార్పు కనిపిస్తుంది. క్రమంగా విపక్షాలు బలం పుంజుకుంటున్నాయి. అభ్యర్థుల మార్పు కావచ్చు. స్థానిక పరిస్థితులు సహకరించకపోవడం కావచ్చు. ఏది ఏమైనా ఈసారి రాయలసీమలో గతంలో వచ్చిన సీట్లు ఈసారి దక్కుతాయా?

Surabhi : చావు అంచులు వరకు వెళ్లి వచ్చా.. హీరోయిన్ వైరల్ పోస్ట్..

టాలీవుడ్ హీరోయిన్ సురభి చేసింది తక్కువ సినిమాలే అయినా.. ఎక్స్‌ప్రెస్ రాజా, జెంటిల్ మెన్, ఒక్క క్షణం, బీరువా వంటి హిట్ సినిమాలతో ఆడియన్స్ లో మంచి గుర్తింపునే సంపాదించుకున్నారు. ఈ భామ సినిమాల్లోనే కాదు, సోషల్ మీడియాలో కూడా చాలా తక్కువ కనిపిస్తూ లో ప్రొఫైల్ మెయిన్‌టైన్ చేస్తూ వస్తుంటారు.

Chandrababu : చంద్రబాబు బెయిల్ రద్దు కేసు వాయిదా

సుప్రీంకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు కేసు వాయిదా పడింది. ఏప్రిల్ 16వ తేదీకి వాయిదా వేస్తూ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో హైకోర్టు చంద్రబాబుకు బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఏపీ ప్రభుత్వం, సీఐడీలు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.

KCR : గేట్లు ఎత్తడం నీకే కాదు బాబాయ్.. వాళ్లకు కూడా అలవాటే.. అర్థమయిందా రాజా?

ఇప్పుడు అనుకుని ఏం లాభం..? అవసరం లేకపోయినా.. ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలని అనుకున్నప్పుడు ఉండాలి. ప్రత్యర్థి పార్టీలను పూర్తిగా శాసనసభలో కనపడకుండా చేయాలన్న కుట్రపూరితమైన ఆలోచన చేయకపోతే నేడు ఈ దుస్థితి వచ్చేది కాదు. నాయకులది తప్పు కాదు. వాళ్లు అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో చేరతారు.

Kalvakuntla Kavitha : మా అమ్మను చూడనివ్వండి.. కవిత కుమారుల అభ్యర్థన

తమ తల్లి కల్వకుంట్ల కవితను కలిసేందుకు అనుమతించాలని ఆమె కుమారులు రౌస్ అవెన్యూ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. కవిత కుటుంబీకులు కలిసేందుకు ఇప్పటికే అనుమతిచ్చిన కోర్టు కుటుంబంలో ఎక్కువ మందిని అనుమతించడం లేదు. కవిత తల్లి శోభతో పాటు ఆమె కుమారులను కూడా కలిసేందుకు కోర్టు అనుమతించింది.

వైసీపీ ఎమ్మెల్యేకు కండువా కప్పిన వైఎస్ షర్మిల

వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్ధర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ షర్మిల సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ఆర్ధర్ కు వైఎస్ షర్మిల పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 2019 ఎన్నికల్లో నందికొట్కూరు నియోజకవర్గం నుంచి ఆర్ధర్ వైసీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు.


Tags:    

Similar News