20August-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్‌ల ను బదిలీలు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జీహెచ్‌ఎంసీ కమిషనర్ గా ఆమ్రపాలిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆమ్రపాలికి జీహెచ్ఎంసీ కమిషనర్ గా పూర్తి బాధ్యతలను అప్పగించింది.
(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
Breaking : తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్‌ల బదిలీ
తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్‌ల ను బదిలీలు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జీహెచ్‌ఎంసీ కమిషనర్ గా ఆమ్రపాలిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆమ్రపాలికి జీహెచ్ఎంసీ కమిషనర్ గా పూర్తి బాధ్యతలను అప్పగించింది. మూసీ డెవలెప్‌మెంట్ మేనేజింగ్ డైరెక్టర్ గా దానకిశోర్ ను నియమించింది. కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ గా ఛాహత్ భాజ్ పేయ్ ను నియమించింది.
Hyderabad : హైదరాబాద్ నగరానికి ఏమైంది? అధిక జన సాంద్రత వల్లనే ఈ కష్టాలా? నరకయాతన
హైదరాబాద్ నగరం అంటే అందరికీ ఇష్టమే. మంచి వాతావరణం. అన్ని మతాలు, కులాలు, రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఇక్కడ స్థిర నివాసం ఏర్పరుచుకుని ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. హైదరాబాద్‌కు వచ్చామంటే బతకడం పెద్ద కష‌్టం కాదు. పేదల నుంచి ధనవంతుల వరకూ అనువైన నగరంగా హైదరాబాద్ కు పేరుంది.
Hyderabad : హైదరాబాద్ కు రెడ్ అలెర్ట్ జారీ అవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరిక
హైదరాబాద్ లో వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించింది. మరికొద్ది గంటల్లో భఆరీ వర్షం పడుతుందని హెచ్చరించింది. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించింది. నగరవాసులు ఈరోజు సెలవు పెట్టి విధులకు వెళ్లకుండా ఇంట్లో ఉండటమే మేలని సూచించింది.
Telangana : తెలంగాణలో మళ్లీ చేరికలు షురూ..శ్రావణమాసం.. రేవంత్ రెడ్డి రాకతో?
దాదాపు పక్షం రోజుల పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చారు. ఢిల్లీకి వెళ్లి వచ్చారు. ఆయన హైదరాబాద్ కు చేరుకుని వెంటనే అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మొన్నటి వరకూ చేరికలు నిలిచిపోయాయి. ఆషాఢమాసం కావడంతో చేరదామనుకున్న వారు కూడా మంచి ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారు.
Telangana : రాఖీ పౌర్ణమి రోజు తెలంగాణ ఆర్టీసీ ఆదయం ఎంతంటే?
రాఖీ పౌర్ణమి నాడు రికార్డు స్థాయిలో తెలంగాణ ఆర్టీసీకి రాబడి వచ్చింది. టిక్కెట్లు చెల్లించిన ప్రయాణికులు 21.12 లక్షల మంది కాగా వారి వల్ల టీజీఆర్టీసీకి వచ్చిన ఆదాయం 32కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ప్రయాణికులు తెలంగాణలోని పలు ప్రాంతాలకు ఆర్టీసీ బస్సుల్లో ఒక్కరోజే 63.86 లక్షల మంది రాకపోకలు సాగించారు.
అనంతపురంలోని హైవేను దిగ్బంధించిన టమోటా రైతులు
అనంతపురంలో టమాటా రైతులు జాతీయ రహదారిపై కూర్చుని ఆందోళనకు దిగారు. మండీ అసోసియేషన్ పేరుతో వ్యాపారస్తులపై రౌడీయిజం చేయడాన్నినిరిస్తూ టమాటారైతులు ఈ ఆందోళనకు దిగారు. దీంతో హైదరాబాద్-బెంగళూరు హైవేపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
మంకీ పాక్స్‌పై భారత ప్రభుత్వం హైఅలెర్ట్.. విమానాశ్రాయాల వద్ద
మంకీ పాక్స్‌పై కేంద్రం అప్రమత్తమైంది. భారత్ లోని అన్ని ఎయిర్‌పోర్ట్‌లను అలర్ట్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా మంకీ పాక్స్ విజృంభిస్తుందని అలెర్ట్ గా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాలను హెచ్చరించింది. అతివేగంగా విస్తరించే ఈ మంకీపాక్స్ సోకకుండా అన్ని దేశాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించింది..
Kolkata : కోల్‌కత్తాలోని వైద్యురాలి హత్యాచార ఘటనపై నేడు సుప్రీంకోర్టులో విచారణ
కోల్‌కత్తాలోని వైద్యురాలి హత్యాచార ఘటనపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఈ ఘటనపై సుప్రీంకోర్టు సుమోటాగా సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఉదయం 10.30 గంటలకు ఈ కేసును విచారించనుంది.
Earth Quake : జమ్మూకాశ్మీర్ లో భూకంపం
జమ్మూకాశ్మీర్ లో ఈరోజు భూకంపం సంభవించింది. ఈరోజు ఉదయం భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మోలజీ తెలిపింది. బారాముల్లా జిల్లాలో ఈ భూప్రకంపనలు సంభవించాయి. జమ్ము కాశ్మీర్ లోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు రావడంతో ప్రజలు భయ భ్రాంతులతో బయటకు పరుగులు తీశారు.
Breaking : కవితకు మరోసారి షాక్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేసు నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. బెయిల్ పై విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేయడానికి ఈడీకి కొంత సమయం సుప్రీం ఇచ్చింది. గురువారం వరకూ ఈడీ కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.