March21-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఈడీ అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు తెలిపింది. తనను ఈడీ అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలంటూ అరవింద్ కేజ్రీవాల్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ పేరుతో తనను పిలిచి అరెస్ట్ చేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టేరేట్ అధికారులు చూస్తున్నారని ఆయన తన పిటీషన్ లో పేర్కొన్నారు.
(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
Breaking : అరవింద్ కేజ్రీవాల్‌కు షాకింగ్ న్యూస్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఈడీ అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు తెలిపింది. తనను ఈడీ అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలంటూ అరవింద్ కేజ్రీవాల్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ పేరుతో తనను పిలిచి అరెస్ట్ చేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టేరేట్ అధికారులు చూస్తున్నారని ఆయన తన పిటీషన్ లో పేర్కొన్నారు.
IPL 2024 : షాకింగ్ న్యూస్ ... ఇది నిజమా? కెప్టెన్‌గానేనా? లేక జట్టు నుంచి తప్పుకున్నాడా?
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి మహేంద్ర సింగ్ ధోని తప్పుకున్నాడు. దీంతో కెప్టెన్సీ బాధ్యతలను రుతురాజ్ గైక్వాడ్ కు జట్టు యాజమాన్యం అప్పగించింది. మహేంద్ర సింగ్ థోని ఇలా హఠాత్తుగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడన్న దానిపై ధోని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
గంట సేపు అదిరిపోతుందట.. అభిమానులకు అదిరిపోయే న్యూస్
ఐపీఎల్ 2024 సీజన్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. రేపు సాయంత్రం చెన్నైలో ప్రారంభం కానున్న ఈ వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేసింది. తొలి మ్యాచ్ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది.
తమిళనాడు గవర్నర్ రవిపై సుప్రీంకోర్టు అసహనం
తమిళనాడు గవర్నర్ ఆర్ఎస్ రవిపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. రాజ్యాంగాన్ని అనుసరించడమంటే ఇలాగేనా? అంటూ ప్రశ్నించింది. నిర్దోషిగా తేలిన డీఎంకే నేతను మంత్రివర్గంలోకి తీసుకునే విషయంలో గవర్నర్ రవి నిరాకరించడాన్ని తప్పు పట్టింది. రేపటిలోగా నిర్ణయాన్ని ప్రకటించాలని పేర్కొంది. గవర్నర్ రాజ్యాంగాన్ని అనుసరించకపోతే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
Breaking : హైకోర్టులో ఏపీ సర్కార్ కు ఊరట
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. గ్రూప్ 1 పరీక్ష పై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు పై హైకోర్టు స్టే విధించింది. సింగిల్ బెంచ్ ఆదేశాలను నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించింది. గ్రూప్ 1 పరీక్ష రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇటీవల తీర్పు చెప్పడంతో దీనిని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
RC16లో ‘కోడి రామ్మూర్తి నాయుడు’గా రామ్‌చరణ్.. ఎవరు ఈ వ్యక్తి..
RC16 : రామ్ చరణ్, జాన్వీ కపూర్ హీరోహీరోయిన్స్‌గా బుచ్చిబాబు తెరకెక్కించబోతున్న చిత్రం 'RC16'. ఈ మూవీ నిన్ననే గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. కాగా ఈ మూవీ శ్రీకాకుళం గోదావరి ప్రాంతం నేపథ్యంతో సాగబోతుందని ఇప్పటికే మేకర్స్ తెలియజేసారు. అయితే స్టోరీ లైన్ ఏంటనేది మాత్రం రివీల్ చేయలేదు. దీని గురించి ఫిలిం వర్గాల్లో ఓ వార్త వినిపిస్తుంది.
38 లక్షల విరాళమిచ్చిన నారా లోకేష్ కుటుంబం
నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా తిరుమల వెంకటేశ్వస్వామిని నారా కుటుంబీకులు దర్శించుకున్నారు. తిరుమల వెంకన్న సన్నిధిలో పూజలు చేశారు. ఏటా దేవాన్ష్ పుట్టిన రోజు వేడుకలను తమ కులదైవమైన వెంకటేశ్వరస్వామి సన్నిధిలోనే జరుపుకుంటుంది.
SS Rajamouli : తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డ రాజమౌళి కుటుంబం
ప్రముఖ దర్శకుడు రాజమౌళి కుటుంబానికి పెద్ద ప్రమాదం తప్పింది. జపాన్ లో పర్యటిస్తున్న ఆ కుటుంబం భూకంపం బారి నుంచి తృటిలో తప్పించుకుంది. ఈ విషయాన్ని రాజమౌళి కుమారుడు కార్తికేయ ఎక్స్ లో వెల్లడించడంతో బాహ్య ప్రపంచానికి వెల్లడయింది. రాజమౌళి తన కుటుంబంతో కలసి జపాన్ లో పర్యటిస్తున్నారు.
Earth Quake : అరుణాచల్ ప్రదేశ్‌లో వరసగా భూకంపాలు.. భయంతో
అరుణాచల్ ప్రదేశ్ లో వరసగా రెండుసార్లు భూకంపం సంభవించింది. ఈరోజు తెల్లవారు జామున ఈ వరస భూకంపాలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అధికారులు తెలిపారు. మొదటి భూకంపం ఉదయం 1.49 గంటలకు నమోదయింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 3.7 గా నమోదయిందని అధికారులు తెలిపారు.
నేడు ఎన్నికల కమిషనర్ ఎదుటకు జిల్లా ఎస్పీలు
నేడు ఎన్నికల కమిషనర్ ఎదుటకు ముగ్గురు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అధికారులు హాజరు కానున్నారు. తమ జిల్లా పరిధిలో జరిగిన హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వనున్నారు. ఇప్పటికే ముగ్గురు అధికారులకు రాష్ట్ర ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. ప్రకాశం, నంద్యాల, పల్నాడు ఎస్పీలు తన ఎదుట హాజరై తమ జిల్లా పరిధిలో జరిగిన ఘటనలపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు.