21July-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

కేరళలో మరోసారి నిఫా వైరస్ కలకలం రేపుతుంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నిఫా వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల కాలంలో కనిపించని నిఫా వైరస్ మళ్లీ కనిపించడంతో అధికారులు అలెర్ట్ చేశారు.

Update: 2024-07-21 12:00 GMT

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

కేరళలో మరోసారి నిఫా వైరస్ కలకలం

కేరళలో మరోసారి నిఫా వైరస్ కలకలం రేపుతుంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నిఫా వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల కాలంలో కనిపించని నిఫా వైరస్ మళ్లీ కనిపించడంతో అధికారులు అలెర్ట్ చేశారు.

Revanth Reddy : రేవంత్ ను రవ్వంత కూడా కదల్చేరా...రోజురోజుకూ స్ట్రాంగ్ అవుతున్నారా?

తొలి సారి ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తారోనన్న ఆందోళన రేవంత్ రెడ్డి నిన్న మొన్నటి వరకూ పార్టీ నేతల్లో ఉండేది. అనుభవం ముఖ్యం కాదయ్యా... ఆత్మవిశ్వాసం ముఖ్యం అన్న రీతిలో రేవంత్ రెడ్డి ఈ ఎనిమిది నెలల ప్రయాణం సాగుతుంది. ఒకవైపు పాలనను గాడిన పెడుతూనే, మరొక వైపు పార్టీని కూడా పూర్తిగా బలోపేతం చేయడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అవుతున్నారు.

నేడు సికింద్రాబాద్ లష్కర్ బోనాలు

నేడు సికింద్రాబాద్ మహంకాళీ అమ్మవారి ఆలయంలో లష్కర్ బోనాలు జరుగుతున్నాయి. సికింద్రాబాద్ లష్కర్ బోనాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మహంకాళి అమ్మవారికి తొలి బోనాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ సమర్పించారు. ఉదయం 8గంటలకు మహంకాళి అమ్మవారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకోనున్నారు.

Bangladesh : కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు... ఇప్పటికే 103 మంది మృతి

బంగ్లాదేశ్ లో హింస కొనసాగుతుంది. ఈ హింసలో దాదాపు నూట మూడు మంది మరణించినట్లు మీడియా సంస్థలు వెల్లడించాయి. బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల సంస్కరణ ల కోసం ఆందోళనలు పెద్దయెత్తున చెలరేగుతున్నాయి. వీటిని అదుపు చేయడం భద్రతాదళాలకు కూడా కష్టంగా మారింది. సైన్యం వల్ల కూడా కావడం లేదు.

Ys Jagan : ఇప్పుడు చేయాల్సింది ధర్నాలు కాదయ్యా సామీ.. అసలు విషయం ఇదీ?

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫలితాలు వచ్చి నలభై ఐదు రోజులు దాటుతుంది. అయితే వైఎస్ జగన్ మాత్రం రాష్ట్రంలో పార్టీపై మాత్రం పెద్దగా ఫోకస్ పెట్టడం లేదు. అంతా హోల్ అండ్ సోల్ తానే చేయాలన్న రీతిలోనే ఆయన వైఖరి కనపడుతుంది. వైసీీపీ అధినేతగా జగన్ చరి‌ష్మాను ఎవరూ కాదనలేరు.

కొంచరియలు విరిగి పడి ముగ్గురు మృతి

ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం జరిగింది. కేదార్‌నాధ్ కు వెళ్లే దారిలో కొండ చరియలు విరిగిపడి ముగ్గురు భక్తులు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. ఉత్తరాఖండ్ రుద్రప్రయాగ్ లో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు చర్యలు చేపట్టాయి.

తెలంగాణ - ఛత్తీస్‌గఢ్ రాకపోకలు బంద్

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కర్ణాటక, మహారాష్ట్రల్లోనూ వర్షాలు అత్యధికంగా నమోదవుతున్నాయి. దీంతో తెలంగాణ - ఛత్తీస్‌గఢ్ మధ్య రాకపోకలకు నిలిచిపోయాయి. రేగుమాకు వాగు వంతెనపై నుంచి ప్రవహిస్తుండటంతో రాకపోకలను నిలిపేశారు.

కొనసాగుతున్న గిరిప్రదిక్షిణ

సింహగిరి ప్రదక్షిణ ఉత్సవం కొనసాగుతుంది. వేలాది మంది భక్తులు గిరి ప్రదిక్షిణ కోసం ఆలయానికి చేరుకుని సింహగిరి నుంచి ప్రారంభించారు. నిన్న సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమైన గిరి ప్రదిక్షిణ నేటి సాయంత్రం వరకూ సాగనుంది. దాదాపు 32 కిలోమీటర్ల మేర సింహచలం కొండ చుట్టూ భక్తులు గిరి ప్రదక్షిణ చేయ్యనున్నారు.

నేడు గురుపౌర్ణమి.. సాయిబాబా ఆలయాలన్నీ భక్తులతో

నేడు దేశ వ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలు జరుగుతున్నాయి. దీంతో సాయి బాబా ఆలయాలు భక్తులతో నిండిపోయాయి. ఈరోజు తెల్లవారు జాము నుంచే సాయిబాబా ఆలయాలకు భక్తులకు క్యూ కట్టారు. సాయిబాబా ఆలయాలన్నీ భక్తులతో నిండిపోయాయి. సాయిబాబా విగ్రహాలపై పాలు పోసి భక్తులు ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నారు. దేశ వ్యాప్తంగా గురు పౌర్ణమి వేడుకలు ప్రారంభమయ్యాయి.

Andhra Pradesh : రాష్ట్రంలో 62 మంది ఐఏఎస్‌ల బదిలీ

ఆంధ్రప్రదేశ్ లో ఉన్నతాధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పిడిన తర్వాత పాలన పరమైన సౌలభ్యం కోసం వరసగా బదిలీలను చేస్తుంది. తాజాగా 62 మంది ఐఏఎస్ లను బదిలీలు చేస్తూ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరికి శాఖలను కేటాయిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.


Tags:    

Similar News