22July-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఆకాశ్ ఎయిర్ లైన్స్ ప్రయాణికులు సిబ్బందితో గొడవకు దిగారు. ఢిల్లీకి వెళ్లాల్సిన విమానం ఆలస్యమవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. బోర్డింగ్ పాస్ లు జారీ చేసిన ఎయిర్ లైన్స్ సిబ్బంది విమానం ఎంతకూ రాకపోయినా సరైన సమాధానం చెప్పడం లేదని ప్రయాణికులు ఆందోళనకు దిగారు.

Update: 2024-07-22 13:29 GMT

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

ఢిల్లీ వెళ్లాల్సిన విమానం...ఆలస్యం కావడంతో ప్రయాణికుల ఆందోళన

శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఆకాశ్ ఎయిర్ లైన్స్ ప్రయాణికులు సిబ్బందితో గొడవకు దిగారు. ఢిల్లీకి వెళ్లాల్సిన విమానం ఆలస్యమవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. బోర్డింగ్ పాస్ లు జారీ చేసిన ఎయిర్ లైన్స్ సిబ్బంది విమానం ఎంతకూ రాకపోయినా సరైన సమాధానం చెప్పడం లేదని ప్రయాణికులు ఆందోళనకు దిగారు.

ఆర్థిక సర్వేను సభ ముందుంచిన నిర్మలమ్మ

కేంద్రమంత్రి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి మంగళవారం బడ్జెట్‌ సమర్పించనున్న వేళ సోమవారం ఆర్థిక సర్వేను సభ ముందుంచారు. దీంతో పాటు గణాంక అనుబంధాన్ని కూడా సభలో ప్రవేశపెట్టారు.

Telangana : మరో రెండు రోజులు భారీ వర్షాలు.. నదులన్నీ ఉప్పొంగుతున్నాయిగా

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అనేక జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కుండ పోత వానలతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల దెబ్బకు వాగులు, వంకలు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.

ఏపీలోని రైతులకు గుడ్ న్యూస్

ఖరీఫ్ సీజన్ కోసం సహకార సంఘాల్లో ఏపీ ప్రభుత్వం ఎరువులను సిద్ధం చేసింది. ఖరీఫ్ సీజన్ కోసం రైతులకు విక్రయించేందుకు 1321 సహకార సంఘాల్లో ఎరువులను సిద్ధం చేశారు. ఖరీఫ్ సీజన్ సన్నద్ధత మీద అధికారులతో ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమీక్షించారు.

భవిష్యవాణి ఇదే... వానలు సమృద్ధిగా పడతాయంటూ

ఉజ్జయిని మహంకాళి అమ్మవారి మహా ఘట్టం ముగిసింది. "రంగం భవిష్యవాణి" అనంతరం అమ్మవారి ఘటం ఊరేగింపు కార్యక్రమం జరిగింది.కోరుకున్నంత వానలు పడతాయి..అనారోగ్యంతో బాధపడుతున్న వారికి అండగా ఉంటా..ఐదు వారాల పాటు పప్పు బెల్లం సాకలతో ప్రత్యేక పూజలు నిర్వహించాలని కోరారు.

భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక

భద్రాచలం వద్ద ఈరోజు ఉదయం 10 గంటలకు గోదావరి నీటిమట్టం 47.4 అడుగులకు చేరుకుంది. సుమారు 11.15 లక్షల క్యూసెక్కుల వరద నీరు నమోదు అవుతుందని అధికారులు తెలిపారు. మరికొద్ది సేపట్లో..48 అడుగులకు చరే అవకాశముందని ఇరిగేషన్ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయింది

Andhra Pradesh : ఈరోజు నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు... రెడీ అయిపోయారుగా

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. సుమారు ఐదు రోజుల పాటు జరిగే అవకాశాలున్నాయి. ఈ నెలాఖరుతో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువు ముగియనుండటంతో మరో మూడు మూడు నెలలకు ఓట్ ఆన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది.

Nipah Virus : హై అలర్ట్.. కేరళలో పెరుగుతున్న కేసులు... నిఫా వైరస్ అంటే ఏంటి? ఎలా వ్యాప్తి చెందుతుంది?

నిఫా వైరస్ మళ్లీ కేరళ రాష్ట్రంలో అలజడి రేపుతుంది. ఇప్పటికే ఇద్దరికి ఈ వైరస్ సోకినట్లు అధికారిక వర్గాలు ధృవీకరించాయి. కేరళలోనే ఈ వైరస్ గతంలో వచ్చింది. అయితే ఇప్పుడు మళ్లీ రావడంతో రాష్ట్ర అధికార యంత్రాంగం అప్రమత్తమయింది. నిఫా వైరస్ సోకిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Ap Assembly : చంద్రబాబు విజనరీ ఉన్న నాయకుడు.. అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉందని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ఈరోజు శాసనసభలో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజనరీ ఉన్న నాయకుడు అన్నారు. విభజన వల్ల ఏపీకి తీవ్ర నష్టం జరిగిందన్నారు.

స్మితా సబర్వాల్ ఎప్పుడూ ఇంతేనా?

సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సివిల్ సర్వీసెస్ కు దివ్యాంగుల కోటా ఎందుకంటూ సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ట్విటర్లో ప్రశ్నించారు. 'దివ్యాంగులంటే పూర్తి గౌరవం ఉంది. కానీ విమానయాన సంస్థలు పైలట్లుగా, ఆస్పత్రులు వైద్యులుగా దివ్యాంగుల్ని నియమించుకోగలమా ? అంటూ ప్రశ్నించారు.


Tags:    

Similar News