March25-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
సమ్మర్ హాలిడేస్ లో సొంతూళ్లకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు సమ్మర్ లోనే ఎక్కువగా పర్యాటక ప్రదేశాలకు వెళుతుంటారు. అందుకే సమ్మర్ హాలిడేస్ లో ట్రైన్ టిక్కెట్లు దొరకడం కష్టం. తక్కువ ఖర్చుతో సుఖవంతమైన ప్రయాణం కావడంతో ఎక్కువ మంది రైలు ప్రయాణాన్నే ఎంచుకుంటారు.
(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
Train : సమ్మర్ హాలిడేస్.. రైళ్లన్నీ ఫుల్లు అయిపోయాయే
సమ్మర్ హాలిడేస్ లో సొంతూళ్లకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు సమ్మర్ లోనే ఎక్కువగా పర్యాటక ప్రదేశాలకు వెళుతుంటారు. అందుకే సమ్మర్ హాలిడేస్ లో ట్రైన్ టిక్కెట్లు దొరకడం కష్టం. తక్కువ ఖర్చుతో సుఖవంతమైన ప్రయాణం కావడంతో ఎక్కువ మంది రైలు ప్రయాణాన్నే ఎంచుకుంటారు.
ఎగిరెగిరి పడితే అంతే బాబాయ్...చివరకు సీటు పాయె.. సిట్టింగ్ స్థానమూ పాయె
నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుందటారు.. ఇగోకు పోతే అసలుకే ఎసరు వస్తుంది. తానే తోపునని భావిస్తే... రాజకీయాల్లో తోసి పడేస్తారు. ఈ ఉదాహరణలకు, సామెతకు ఒకే ఒక్కడు కనిపిస్తాడు రఘురామ కృష్ణరాజు. డబ్బుందని.. తన ఇమేజ్ వల్లనే గెలిచాడని ఆయన ఇన్నాళ్లు భ్రమలో ఉన్నాడు.
IPL 2024 : నేడు రాయల్ ఛాలెంజర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్
ఐపీఎల్ మ్యాచ్ లు ఈ నెల 22వ తేదీన ప్రారంభమయ్యాయి. ఈరోజు ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది. బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ తో తొలి మ్యాచ్ ఓడిపోవడంతో కసి మీదున్న బెంగళూరు జట్టు ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని పోరాడుతుంది.
IPL 2024 : పాండ్యాను ఏకిపారేస్తున్న నెటిజన్లు...ఓటమికి నువ్వే కారణమంటూ
అంతే... సమిష్టి శ్రమతో గుజరాత్ టైటాన్స్ ను ఒకసారి కప్ సాధించి, మరొక సీజన్ లో ఫైనల్స్ కు తెచ్చిన హార్ఢిక్ పాండ్యా జట్టు మారి తొలి ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. ఇంకా చాలా మ్యాచ్‌లు ఉన్పప్పటికీ హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతారని భావించిన ముంబయి ఇండియన్స్ తొలి మ్యాచ్ లోనే తప్పటడుగు వేసింది.
BJP : ఆరుగురు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ
భారతీయ జనతా పార్టీ తన అభ్యర్థులను ప్రకటించింది. ఆరు పార్లమెంటు స్థానాలకు తన అభ్యర్థులను ప్రకటించింది. కొత్తగా చేరిన వారికి రెండు సీట్లు ప్రకటించగా, పాత వారికి కొందరికి సీట్లు కేటాయించలేదు. పొత్తులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ఆరు పార్లమెంటు స్థానాల్లో బీజేపీ పోటీ చేయనుంది. నరసాపురం టిక్కెట్ ను శ్రీనివాసవర్మ, తిరుపతి నుంచి వరప్రసాద్, రాజంపేట నుంచి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేరు ప్రకటించింది.
అమరావతి ఉద్యమానికి తాత్కాలిక బ్రేక్
రాజధాని అమరావతి ఉద్యమానికి తాత్కాలిక విరామాన్ని రైతులు ప్రకటించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా విరామం ఇస్తున్నట్లు రైతులు ప్రకటించారు. దాదాపు 1,560 రోజులుగా సాగుతునన అమరావతి ఉద్యమానికి రైతులు విరామం ఇస్తున్నట్లు ప్రకటించారు. అయతే ఇళ్ల వద్ద ఉండే తమ నిరసనలు కార్యక్రమాలు చేపడతమాని వారు తెలిపారు.
వ్యక్తిగత కారణాలవల్లనే హత్య : పోలీసులు
వ్యక్తిగత కారణాలవల్లే కుటాలపల్లికి చెందిన అమర్నాథ్ రెడ్డి హత్య జరిగిందని డీఎస్‌పీ వాసుదేవన్ తెలిపారు. నల్లమాడ మండలం కుటాలపల్లి లో ఆదివారం రాత్రి జరిగిన అమర్నాథ్ రెడ్డి హత్య జరిగిందని, ఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ శ్రీ ఎస్వీ మాధవ్ రెడ్డి , డీఎస్పీ వాసుదేవన్ పరిశీలించారు. ఈ హత్య కేసును వెంటనే ఛేదించాలని ఉన్నతాధికారులు పోలీస్ సిబ్బందిని ఆదేశించారు.
ఆ సీటు నాకు ఇవ్వాల్సిందే.. పవన్ కూడా మాట ఇచ్చారు
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు తనకు ఇవ్వాలని జనసేన నేత పోతిన మహేష్ కోరారు. ఆయనకు పశ్చిమ సీటు కేటాయించాలని పోతిన మహేశ్ అనుచరులు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పోతిన మహేష్ మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గం లో తాను లోకల్ అని ఆయన అన్నారు. కూటమి లో భాగంగా తనకే సీటు కేటాయించడం నాయ్యమన్నారు.
హోలీ రోజున విషాదం.. కొండ చరియలు విరిగిపడి ఇద్దరు మృతి
హిమాచల్ ప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. కొండచరియలు విరిగిపడటంతో జరిగిన తొక్కిసలాటలో ఇద్దరు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. హిమాచల్ ప్రదేశ్ లోని హోలా మొహల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. హోలీ పండగ రోజున ఈ ఘటన జరగడంతో అక్కడ విషాదం నెలకొంది. మేడిలో హోలీకి మొహల్లా వేడుక జరుగుతుండగా ఒక్కసారిగా కొండ చరియలు విరిగిపడ్డాయి.
సెల్‌ఫోన్ పేలి నలుగురు చిన్నారుల సజీవ దహనం
ఉత్తర్‌ప్రదేశ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నలుగురు చిన్నారులు సజీవ దహనమయ్యారు. ఉత్తర్‌ప్రదేశ్ లోని మీరటర్ జిల్లా పల్లవ్‌పురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా పిల్లలు నలుగురు సజీవ దహనమయ్యారు. మోదిపురం జనతా కాలనీలో ఓ ఇంట్లో భార్యాభర్తలు, నలుగురు పిల్లలు నివాసముంటున్నారు.