టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
అయోధ్యలో తలుపులు చేసింది మనోళ్లే, ఫ్యాన్ పార్టీలో మరో కీలక వికెట్ అవుట్?, ఏటా ఇక "ఆడుదాం ఆంధ్ర"
(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
Ayodhya : అయోధ్యలో తలుపులు చేసింది మనోళ్లే
అయోధ్యలో రామమందిరం ప్రారంభానికి ముహూర్తం దగ్గరపడింది. వచ్చే నెల 22వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ఆలయాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకోసం భారీ సన్నాహాలు చేస్తున్నారు. లక్షలాది మంది భక్తులు అయోధ్య చేరుకునేందుకు ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నారు.
YSRCP : ఫ్యాన్ పార్టీలో మరో కీలక వికెట్ అవుట్?
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో జంపింగ్ లు ఎక్కువవుతున్నాయి. టిక్కెట్ ఆశించి భంగపడిన నేతలు.. కూటమి గెలుస్తుందన్న నమ్మకంతో ఉన్న లీడర్లు తమ దారి తాము చూసుకునే ప్రయత్నంలో పడ్డారు. అధికార పార్టీ నుంచి బయటకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
Heart Attack : క్రిస్మస్ పండగకు ఇంటికి వచ్చి... బాలుడు గుండెపోటుతో మృతి
పదమూడు ఏళ్ల వయసున్న బాలుడు గుండెపోటుతో మరణించిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్‌లో సోమవారం సాయంత్రం ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. తాళ్లపల్లి శంకర్, సరిత దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు.
Ys Sharmila : షర్మిలపై గిడుగు హాట్ కామెంట్స్
వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లోకి వస్తే ఆహ్వానిస్తామని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అన్నారు. షర్మిలను పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమిస్తున్నారన్న దానిపై తన వద్ద ఎలాంటి సమాచారం లేదని అన్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా తాము కట్టుబడి ఉన్నామని గిడుగు రుద్రరాజు తెలిపారు.
Telangana : వాహనదారులకు గుడ్ న్యూస్
తెలంగాణలో వాహనదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పెండింగ్ చలాన్లపై రాయితీ ఇస్తూ తీసుకున్న నిర్ణయంపై ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. పెండింగ్ చలాన్లపై రాయితీ వర్తింపు నేటి నుంచే అమలులోకి రానుంది. వాహనదారులు తమ పెండింగ్ చలాన్లను ఆన్ లైన్ ద్వారా చెల్లించి రాయితీని పొందవచ్చని పోలీసు అధికారులు చెబుతున్నారు.
Ayodhya : అయోధ్య రామ మందిర్ ఓపెనింగ్‌కి.. ఈ మూవీ స్టార్స్ అతిథులుగా..
రామజన్మ భూమి అయోధలో రామ్ మందిర్ ప్రారంభోత్సవం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులంతా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. 2024 జనవరి 24న రామమందిర ప్రారంభోత్సవం జరగనుందని తెలుస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతులు మీదుగా ఈ ప్రారంభోత్సవం జరగబోతుందట.
Ys Jagan : ఏటా ఇక "ఆడుదాం ఆంధ్ర"
గ్రామస్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులగా మలచడానికే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. గుంటూరు జిల్లా నల్లపాడులో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఆరోగ్యంగా ఉండేందుకు క్రీడలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
అంగన్ వాడీతో చర్చకు ప్రభుత్వం సిద్ధం
గత కొద్దిరోజులుగా సమ్మె చేస్తున్న అంగన్ వాడీ వర్కర్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్చలకు పిలిచింది. సాయంత్రం 4.30 గంటలకు మంత్రి వర్గం ఉపసంఘంతో చర్చించాలని అంగన్ వాడీ సంఘాలకు ఆహ్వీనం పలికింది. గత పదిహేను రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో అంగన్ వాడీ వర్కర్లు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే.
Son and Mother : వీడు కొడుకు కాడు.. కిరాతకుడు.. తల్లినే స్థంభానికి కట్టేసి?
తల్లి అంటే దైవంతో సమానం. కన్నతల్లి పంచిన ప్రేమను వృద్ధాప్యంలో ఆమెకు రుచిచూపించాల్సిన కొడుకులే కాలయముడిలా మారుతున్నారు. కుటుంబ బాంధవ్యాలను మరిచిపోయి ప్రవర్తించడం మామూలుగా మారిపోయింది. తల్లి లేదు.. కన్న తల్లి అన్న ధ్యాస లేదు.. ఎంతసేపూ సంపాదనపైనే ధ్యాస. అటువంటి అమానవీయ ఘటన ఒకటి ఒడిశాలో చోటు చేసుకుంది.
Revanth Reddy : ప్రధానితో భేటీ అయిన రేవంత్
ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఆయనతో పాటు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి విక్రమార్క కూడా సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు రావాల్సిన పెండింగ్ నిధుల విడుదల గురించి ప్రధాని మోదీ దృష్టికి తీసుకురానున్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరనున్నారు.